తెలంగాణ

‘భగీరథ’కు భూ వితరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: మిషన్ భగీరథ పనులకు అవసరం అయిన భూమిని ప్రజలు సంతోషంగా ఇస్తున్నారని, భూ సేకరణలో ఎక్కడా ఇబ్బందులు ఎదురు కావడం లేదని, తాగునీటి కొరతను తీర్చే ఈ పథకానికి ప్రజలు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారని పంచాయితీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ తెలిపారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులపై ఎస్‌పి సింగ్ శుక్రవారం సమీక్షించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు దేశ చరిత్రలోనే మహోన్నతమైనదని సింగ్ తెలిపారు. ఆలేరు, భునవగిరి సెగ్మెంట్‌లో పనులను పరిశీలించారు. ఏప్రిల్ 30నాటిక తొమ్మిది నియోజక వర్గాల్లో ఇంటింటికి నీళ్లను అందించనున్నట్టు చెప్పారు. ప్రాజెక్టుకు అవసరం అయిన భూములు ఇవ్వడానికి ప్రజలు సంతోషంగా ముందుకు వస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టు పనులతో పంట నష్టపోతున్న రైతులకు పరిహారం త్వరగా అందించాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తికావడానికి భగీరథ ఇంజనీర్లు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. నల్లగొండ జిల్లా బొమ్మల రామారం మండలం రామలింగాపల్లిలో నిర్మిస్తున్న పనులను పరిశీలించారు. మిషన్ భగీరథ లాంటి భారీ ప్రాజెక్టు దేశంలో ఎక్కడా లేదని అన్నారు.

ఏఇ నియామక పరీక్ష ఫలితాలు

హైదరాబాద్, డిసెంబర్ 18: ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ 2015 ఫలితాలను విడుదల చేశారు. నవంబర్ 29న ఎలక్ట్రికల్, సివిల్ అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టులకు పరీక్ష నిర్వహించారు. వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. ఫలితాల కోసం ఆఒఆ్ఘశఒష్య.ష.్య్ప.జశ ను ఛూడవచ్చునని డైరెక్టర్ జి నర్సింగ్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.