తెలంగాణ

ప్రాజెక్టులు పరిగెత్తాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: నీటిపారుదల ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశించారు. నిర్మాణంలోవున్న ప్రాజెక్టులతోపాటు కృష్ణానదిపై పాలమూరు, డిండి, గోదావరిపై కాళేశ్వరం, ప్రాణహిత, దుమ్ముగూడెం ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతుకు సాగునీరు అందించడానికే ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రాణత్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజలకు ఎన్నో ఆకాంక్షలున్నాయని, వాటిని నెరవేర్చడంలో పాలనాపరమైన జాప్యాన్ని వీలైనంత వరకు నివారించాల్సి అవసరం ఉందన్నారు. సచివాలయంలో శుక్రవారం నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సిఎం చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కె జోషి, ఇఎన్‌సి మురళి, ఆర్థికశాఖ కార్యదర్శులు రామకృష్ణారావు, శివశంకర్ తదితర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ యువకుల కోసం ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని, అదేక్రమంలో రైతులకు సాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పటికే ప్రగతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయడంతో పాటు కృష్ణాపై పాలమూరు, డిండి ప్రాజెక్టులు, గోదావరిపై కాళేశ్వరం, ప్రాణహిత, దుమ్ముగూడెం ప్రాజెక్టలను త్వరగా పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించారు. గతంలో నీటిపారుదల ప్రాజెక్టులు దశాబ్దాలపాటు సాగేదని, అలాకాకుండా రాష్ట్రంలో రెండు మూడేళ్లలోనే ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ఎదురయ్యే జాప్య నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. భూసేకరణ కోసం మునుపటిలా కాకుండా తాజాగా తీసుకున్న నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు వచ్చాయని, భూసేకరణ వేగవంతంగా జరుగుతోందని సిఎం సంతృప్తి వ్యక్తంచేశారు. కాంట్రాక్టర్లతో పనులు వేగంగా జరిపించడానికి వారికి ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించడానికి బడ్జెట్‌లో కేటాయింపులు నేరుగా ఖర్చుపెట్టే విధానాన్ని రూపొందించాలని సిఎం సూచించారు. ఇకనుంచి ఏటా బడ్జెట్‌లో నీటిపారుదల ప్రాజెక్టుల కోసం రూ.25వేల కోట్లు కేటాయించనున్నట్టు చెప్పారు. కాంట్రాక్టర్లను మూడు షిప్టుల్లో పనిచేయించి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమన్నారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు ఒక శాతం ఇనె్సంటివ్ ఇవ్వాలని, అలాగే పూర్తిచేయని కాంట్రాక్టర్ల నుంచి నష్టపరిహారాన్ని రాబట్టుకునేలా విధానం ఉండాలని అభిప్రాయపడ్డారు. దీనివల్ల కాంట్రాక్టర్లలో ఉత్సాహం, బాధ్యత, భయం ఏర్పడుతోందన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను అత్యధిక ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

చిత్రం.. ఇరిగేషన్ ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహిస్తున్న సిఎం కెసిఆర్