ఆంధ్రప్రదేశ్‌

బాబు అవినీతి, అమరావతి భూదందాలపై విచారణ జరిపించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అమరావతిని రాజధానిగా అధికారికంగా ప్రకటించకముందే టిడిపికి చెందిన నేతలు, మంత్రులు నాలుగువేల ఎకరాలను బినామీ పేర్లతో కొనుగోలు చేసిన ఉదంతంపై కేంద్రప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలని, ఈ విషయంలో ఉదాసీన వైఖరిని ప్రదర్శించరాదని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. తాను పారదర్శకపాలనను అందిస్తున్నానని, మచ్చ లేదని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తనపై వచ్చిన అవినీతి, భూదందాలపై విచారణకు సిద్ధంగా ఉండాలన్నారు. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంత్రులు పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్, దేవినేని ఉమామహేశ్వరరావు, కేంద్రమంత్రి సుజనా చౌదరి, రాజమండ్రి ఎంపి మురళీ మోహన్ భూములు కొనుగోలు చేశారన్నారు. తక్కువ ధరకు అసైన్డ్ భూములను ఎస్సీ, ఎస్టీల నుంచి కొనుగోలు చేశారన్నారు. తాము అభియోగం మోపుతున్న మంత్రులు, నేతలు అమరావతిలోనే సెప్టెంబర్ కంటే ముందుగా భూములు కొనుగోలు చేశారంటే ఆ విషయం అప్పటికీ వారికి తెలిసిందన్నారు. ఈ భూములు కుటుంబ సభ్యుల పేర్ల మీద రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాలుంటే కేవలం విజయవాడ, గుంటూరు జిల్లాల పరిధిలో విస్తరించిన అమరావతి రాజధాని ప్రాంతంలోనే ఎందుకు కొనుగోలు చేశారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మాణం సమయంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం ఈ తరహా విధానాన్ని అవలంభించిందన్నారు. భూదందాపై న్యాయ విచారణ జరిపించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా కోట్లాది రూపాయలను అవినీతికి టిడిపి పాల్పడిందన్నారు. వివిధ సాగునీటి ప్రాజెక్టుల్లో జరుగుతున్న దోపిడీ వల్ల ఖజానా ఖాళీ అవుతోందన్నారు.