తెలంగాణ

ఇవిఎంలను తారుమారు చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: వరంగల్ ఉప ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను తారు-మారు చేశారని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ విమర్శించారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయనున్నట్లు ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. న్యాయం జరగకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు ఆయన చెప్పారు. ఇవిఎంల వినియోగంపై అన్ని పార్టీలూ కళ్ళు తెరవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇవిఎంల వాడకాన్ని ఇదివరకే అమెరికా తదితర దేశాలు నిలిపి వేశాయని ఆయన తెలిపారు. వరంగల్‌లోని వలికోలు పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్‌కు ఒక్కటే ఓటు ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. వరంగల్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి లోగడ అంటే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కౌన్సిల్‌కు జరిగిన హైదరాబాద్-మహబూబ్‌నగర్-రంగారెడ్డి జిల్లాల పట్ట్భద్రుల నియోజకవర్గం నుంచి ఎందుకు గెలుపొందలేదని ఆయన ప్రశ్నించారు. అప్పుడు ఘోరంగా ఓడిపోయిందని, నల్లగొండ-వరంగల్ పట్ట్భద్రులు నియోజకవర్గంలో చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా గెలుపొందిందని ఆయన తెలిపారు. కాబట్టి వరంగల్‌లో ఉపయోగించిన ఇవిఎంలపై తమకు నమ్మకం లేదు కాబట్టి ప్రస్తుతం స్ట్రాంగ్ రూంలో ఉన్న ఇవిఎంలను రిటైర్డ్ న్యాయమూర్తి సమక్షంలో పరిశీలన చేయించాలని డిమాండ్ చేశారు. తప్పు జరిగినట్లు రుజువైతే సిఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలన్న ఆకాంక్ష ఉండేది కాదని సర్వే విమర్శించారు.