తెలంగాణ

జీవోల వెబ్‌సైట్ పునరుద్ధరణ ఎప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ‘తెలంగాణ జీవోల వెబ్‌సైట్ పునరుద్ధరణకు ఎన్ని రోజులు పడుతుంది?’ అని హైదరాబాద్ హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎన్ని రోజుల్లో పునరుద్ధరిస్తారో కోర్టుకు తెలియజేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పివి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ప్రభుత్వం జారీచేసే జివోలను పారదర్శకంగా ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు ఉన్న ప్రభుత్వ వెబ్‌సైట్‌ను అర్ధాంతరంగా రద్దు చేసిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శ్రవణ్‌కుమార్ తరఫున అడ్వకేట్ ఆర్. రఘునందన్ హైకోర్టులో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం ఎటువంటి కారణం చూపకుండా వెబ్‌సైట్‌ను రద్దు చేసిందని కోర్టుకు విన్నవించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008లో అప్పటి ప్రభుత్వం ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించిందని ఆయన వివరించారు. అయితే విభజన అనంతరం కూడా చాలాకాలం వరకు తెలంగాణ రాష్ట్ర వెబ్‌సైట్‌గా ఉన్నదని ఆయన గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర వెబ్‌సైట్‌ను కొనసాగిస్తున్నదని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెబ్‌సైట్‌ను రద్దు చేయడం సమాచార హక్కు చట్టంలోని సెక్షన్-4ను రద్దు చేయడమే అవుతుందని అడ్వకేట్ కోర్టుకు విన్నవించారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత కోసం ప్రభుత్వ నిర్ణయాలను, జీవోలను వెబ్‌సైట్‌లో పెట్టాలని అన్నారు. పిటిషనర్ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ పివి సంజయ్ కుమార్ ప్రభుత్వం తరపు అడ్వకేట్‌ను వివరణ అడిగారు. అందుకు న్యాయవాది నజీబ్‌ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వం ఈ వెబ్‌సైట్‌ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టిందని, అందుకే తాత్కాలికంగా ప్రజలకు వెబ్‌సైట్ అందుబాటులో లేదని అన్నారు. కాబట్టి ప్రభుత్వానికి కొంత గడువు ఇవ్వాలని ఆయన కోరారు. కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ ఎన్ని రోజుల గడువు కావాలో చెప్పాలని న్యాయమూర్తి ఆదేశించారు. పిటిషనర్, టిపిసిసి ముఖ్య అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చీకటి విధానాలు, నిర్ణయాలు ప్రజలకు తెలియకుండా ఉండేందుకే వెబ్‌సైట్‌ను రద్దు చేసిందని విమర్శించారు.