తెలంగాణ

యుద్ధప్రాతిపదికన యార్డుల కంప్యూటరీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: తెలంగాణ రాష్ట్రంలో గుర్తించిన 44 మార్కెట్ యార్డుల కంప్యూటరీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి మార్కెటింగ్ శాఖపై సమీక్షించారు. పత్తి కొనుగోళ్లు, నూతన గొడౌన్ల నిర్మాణం, కోల్డ్‌స్టోరేజిలు, హమాలీలకు ఇన్సూరెన్స్, హెల్త్ క్యాంప్‌ల నిర్వహణ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. మార్కెటింగ్ శాఖ డైరక్టర్ శరత్, అదనపు డైరక్టర్ లక్ష్మీబాయి ఈ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి ప్రసంగిస్తూ సిసిఐ పత్తిని ఎంత కొనుగోలు చేసిందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. 83 పత్తి కొనుగోలు కేంద్రాలను సిసిఐ ప్రారంభించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యాపారులకు పత్తి అమ్మకూడదనే విషయంపై విస్తృత ప్రచారం చేయాలని అన్నారు. సిసిఐకి మాత్రమే ఎందుకు అమ్మాలనే విషయాన్ని రైతులకు శాస్ర్తియంగా వివరించాలని మంత్రి సూచించారు. హమాలీలందరికి బీమా కలిగించే పని నూరు శాతం పూర్తి చేయాలని మంత్రి అన్నారు. డిసెంబర్ 30 నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అన్నారు. కంప్యూటరీకరణ పనులు పెండింగ్‌లో ఉంచకుండా టెండర్లు పిలిచి వెంటనే పూర్తి చేయాలని అన్నారు. బోయిన్‌పల్లి, వంటిమామిడి, వరంగల్‌లో నిర్మించ తలపెట్టిన కోల్డ్ స్టోరేజ్‌ల పురోగతిపై ఈ సమావేశంలో మంత్రి చర్చించారు. రంగారెడ్డి జిల్లాలో హయత్‌నగర్‌లో ఉన్న పండ్లమార్కెట్‌ను తరలించడం కోసం అదే మండలంలోని కోహెడ వద్ద గుర్తించిన స్థలాన్ని సిఎల్‌ఆర్‌తో చర్చించి స్వాధీనం చేసుకోవాలని సూచించారు.