తెలంగాణ

అప్పారావును అరెస్టు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎస్‌సి, ఎస్‌టిలపై అత్యాచార నిరోధక చట్టం కింద కేసు ఎదుర్కొంటున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటి వైస్ చాన్సలర్ అప్పారావును వెంటనే అరెస్టు చేయాలని, ఆ పదవి నుంచి డిస్మిస్ చేయాలని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్‌సి, ఎస్‌టి కేసు ఎదుర్కొంటున్న విసి అప్పారావును అరెస్టు చేయకుండా, తిరిగి ఆయనకు విసిగా అవకాశం ఇవ్వడమేమిటని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ పాశవిక పాలనకు, రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతున్నదని మంగళవారం ఆయన పార్టీ ఎమ్మెల్యేలు భట్టివిక్రమార్క, టి.రాంమోహన్ రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, ఎన్‌ఎస్‌యుఐ జాతీయ అధ్యక్షుడు రోజ ఎం.జాన్, ఇతర నాయకులు కార్తీక్‌రెడ్డి, వెంకట్‌తో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ దుయ్యబట్టారు. హెచ్‌సియు, ఉస్మానియా వర్శిటీల్లో పాలకులు నిరంకుశ విధానాలను అవలంబిస్తూ, కనీస హక్కులను హరిస్తున్నారని విమర్శించారు. హెచ్‌సియులో రోహిత్ వేములను దళిత విద్యార్థి అని అవమానించి బహిష్కరించినందుకే ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. ఈ మేరకు విసిపై ఎస్‌సి, ఎస్‌టి చట్టం కింద కేసు నమోదు చేశారని గుర్తు చేశారు. పోలీసులు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
అప్పారావును రీ-కాల్ చేయాలి: విహెచ్
ఇలాఉండగా ఎఐసిసి నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు, పార్టీ ఎస్‌సి విభాగం నాయకుడు కృష్ణతో కలిసి మీడియాతో మాట్లాడుతూ హెచ్‌సియు విసి అప్పారావును వెంటనే రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాయాలని కోరారు. తానూ లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ అంటీముట్టనట్లుగా ఉండడం భావ్యం కాదన్నారు. జెఎన్‌యు నేత కన్హయ్య కుమార్ హైదరాబాద్‌కు చేరుకుని రోహిత్ వేముల తల్లిని పరామర్శించి సభ నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ఆ సభను అడ్డుకునేందుకే విసిని తిరిగి విధుల్లో చేరేలా ఆదేశాలు ఇచ్చిందని విహెచ్ విమర్శించారు.

విద్యార్థులపై
కక్ష సాధిస్తారా?
అరెస్టులు దారుణం: సిపిఐ నారాయణ
తక్షణం విడుదల చేయాలి: కె.రామకృష్ణ
విసిని అరెస్టు చేయాలి: తమ్మినేని
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 23: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ప్రొఫెసర్లు, విద్యార్ధులపై జరిగిన లాఠీచార్జి అక్రమ అరెస్టులపై ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు, నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దళిత సంఘాల నాయకులు ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించాయి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ప్రొఫెసర్లు, విద్యార్ధులపై పోలీసులు దౌర్జన్యంగా లాఠీచార్జి చేయడంపై సంఘాల నాయకులు మండిపడ్డారు. అరెస్టు చేసిన విద్యార్ధులు, ప్రొఫెసర్లను తక్షణమే విడుదల చేయాలన్నారు. అప్పారావును పదవి నుండి వెంటనే తొలగించాలని కోరారు. ఆల్ ఇండియా ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఆర్ కె అగ్నిహోత్రి, తదితరులు డమ డిమాండ్లను విసికి పంపించారు. కాగా విద్యార్ధుల అరెస్టు చాలా దారుణమని సిపిఐ నేత నారాయణ పేర్కొన్నారు. ఈ పరిణామాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. తక్షణం విసి అప్పారావును బాధ్యతల నుండి తొలగించాలని నారాయణ కోరారు. విద్యార్ధులపై కేసులు పెట్టడం తగదని సిపిఐ ఎపి రాష్టక్రార్యదర్శి కె. రామకృష్ణ పేర్కొన్నారు. రోహిత్ మరణానికి లాఠీఛార్జీకి కారకులైన విసి అప్పారావును అరెస్టు చేయాలని, విసిగా తొలగించాలని సిపిఎం తెలంగాణ రాష్టక్రార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.

ఆర్టీసీ బస్సు బోల్తా
ఆరుగురు ప్రయాణికులకు గాయాలు
సూర్యాపేట, మార్చి 23: ఆర్టీసీ బస్సు బోల్తాపడిన ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చివ్వెంల మండల పరిధిలోని బీబీగూడెం గ్రామశివారులో గల మధుర దాబా వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం డిపోకు చెందిన ఎపి 29జడ్ 2398 నెంబరుగల ఆర్టీసీ ఇంద్ర బస్సు 22 మంది ప్రయాణికులతో మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఖమ్మం నుండి హైదరాబాద్‌కు బయలుదేరింది. తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో బస్సు బీబీగూడెం శివారులో ఎదురుగా వస్తున్న జెసిబి ముందు ఉన్న తొట్టెను ఢీకొంది. ఈ సంఘటనలో బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన బోల్తాపడింది. దీంతో బస్సు డ్రైవర్ కళ్యాణ్ శ్రీనివాస్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన బి.పద్మ అనే మహిళతో పాటు మరో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు బోల్తాపడిన ప్రయాణికులు ప్రాణాలతో బయటపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సులోని ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు చివ్వెంల ఎస్‌ఐ ఎ.శ్రీనివాస్ తెలిపారు.
సిద్దిపేట మున్సిపల్
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
సిద్దిపేట, మార్చి 23: సిద్దిపేట మున్సిపల్ నామినేషన్ల ప్రక్రియకు సజావుగా సాగుతుందని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు దినకర్‌బాబు అన్నారు. ఋధవారం మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఆనంతరం ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల కోసం అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసిందన్నారు. 34 వార్డులకు ప్రత్యేకంగా 34 కౌంటర్లు ఏర్పాటు చేసిందన్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఈవిఎంలను పరిశీలించనున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి వారి సందేహాలను నివృత్తి చేయనున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు ఈనెల 24న స్కూృటిని, 25న ఉప సంహరణ ఆనంరతం అభ్యర్థుల తుదిజాబితా ప్రకటించి, గుర్తులను కేటాయించనున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నకల కోసం శాంతిభద్రతల సమస్యల ఉత్పన్నం కాకుండ పోలీసు శాఖ పక్షాన గట్టి బందోబస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అంతకు ముందు మున్సిపల్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ప్రశాంతంగా నామినేషన్ల ఘట్టాన్ని పూర్తి చేసిన అధికారులను అభినందించారు.