తెలంగాణ

ప్రజాపోరు ఆపలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, జూన్ 7: ప్రజా తెలంగాణ సాధనకు పోరాటం కొనసాగుతుందని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ కోదండరామ్ ప్రకటించారు. ప్రజలు కోరుకునే తెలంగాణ కోసం ఉద్యమం సాగిస్తామని, ఎన్ని ఒత్తిళ్లొచ్చినా వెనక్కి తగ్గేది లేదని వెల్లడించారు. మంగళవారం మంచిర్యాలలోని ఎస్వీ ఫంక్షన్ హాలులో రెండేళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ప్రభుత్వ తీరు తెన్నులపై ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడారు. ప్రజల అభ్యున్నతే తెలంగాణ ఐక్య కార్యచరణ కమిటీ లక్ష్యమన్నారు. ప్రజల పక్షానే జెఎసి ఏర్పడిందని ఉద్ఘాటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన కార్యచరణతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. జెఎసికి ఎవరి గుర్తింపూ, ఎవరో ఇచ్చే పదవులు అవసరం లేదన్నారు. తెలంగాణ రాష్ట్భ్రావృద్ధే తప్ప వేరే కోరికలు జెఎసికి లేవన్నారు. ఇప్పటికే నా జీవితంలో మాడొంతులు గడిచిపోయింది. మిగతా పావు జీవితంలో ఎవరి చేత ప్రేరేపించబడేది లేదు. జీవితాన్నంతా ప్రజా ఉద్యమాలకే కేటాయిస్తానని ప్రకటించారు. జెఎసి రాజకీయ సంస్థ కాదని, ప్రజల పక్షాన పోరాటం చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వంలోని కొందరు నాయకులు తమపై చేస్తున్న విమర్శలకు భయపడేది లేదని, ఆ నాయకులు ఎక్కడి నుంచి వచ్చారో గుర్తు చేసుకోవాలన్నారు. తెరాస ప్రజాప్రతినిధులు చేస్తున్న విమర్శలపై బుధవారం నిర్వహిస్తోన్న టి.జెఎసి స్టీరింగ్ కమిటీలో చర్చించి సమాధానమిస్తామన్నారు. నాంపల్లిలోని టిజెఎసి కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటలకు టిజెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. సమావేశంలో మంత్రుల విమర్శలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన మాదిరిగానే ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే వరకూ ఉద్యమాలు సాగుతాయని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా సంఘాల పాత్ర ఎంతో అవసరం ఉంటుందని, ఉద్యమాలు నడిపించడానికే సదస్సు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన వారికి ప్రజా సమస్యలపై పోరాడే అర్హత లేదా? అని ప్రశ్నించారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు తనపై చేసిన వ్యాఖ్యలకు బాధపడేది లేదని, ప్రతీ నాయకుని ప్రశ్నకు సమాధానమిస్తామని, జీవితంలో విమర్శలు సాధారణమేనన్నారు. భవిష్యత్‌లో ఓపెన్ కాస్టుల ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలని, ఓపెన్ కాస్టుల మట్టి తరలింపు పనుల్లో స్థానికులకే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తూర్పు ప్రాంతంలో విద్య, వైద్య సదుపాయాలు సక్రమంగా లేవని, వ్యవసాయం అంతంతమాత్రంగా ఉందన్నారు. ఈ సదస్సులో జెఎసి రాష్ట్ర కో-ఆర్డినేటర్ పిట్టల రవీందర్, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గురిజాల రవీందర్ రావు, జిల్లా అధ్యక్షులు సంజీవ్, తూర్పు జిల్లా జెఎసి చైర్మన్ గోనె శ్యాంసుందర్ రావు, సంయుక్త కార్యదర్శి బాపన్న తదితరులు పాల్గొన్నారు.

చిత్రం,,, మంచిర్యాల సదస్సులో మాట్లాడుతున్న టిజెఎసి చైర్మన్ కోదండరాం