రాష్ట్రీయం

ఎమ్సెట్-3 ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: తెలంగాణ వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఎంసెట్ 3 ప్రవేశ పరీక్ష రెండు రాష్ట్రాల్లోనూ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. రెండు రాష్ట్రాల్లో 66.25 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎంసెట్ పేపర్ లీకేజీతో ఎంసెట్ 3 పరీక్ష నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 91 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఉదయం 10 గంటలకు మొదలైన పరీక్ష మధ్యాహ్నాం ఒంటిగంటకు ముగిసింది. పరీక్ష ప్రశాంతంగా జరిగినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. తెలంగాణలో పరీక్షకు 40,596 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారు. వీరిలో 39,500 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈనెల 16న ఎంసెట్ ఫలితాలు విడుదల చేస్తారు. తెలంగాణలోని పది జిల్లాల్లో 72.14 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఆంధ్రలో కర్నూలు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం జిల్లాల్లోని సెంటర్లలో మొత్తం 53.70 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. హైదరాబాద్ బి సెంటర్‌లో అత్యధికంగా 77.30 శాతం మంది హాజరు కాగా, తిరుపతిలో అత్యల్పంగా 48.80 శాతం మంది హాజరయ్యారు. తెలంగాణలోని పది కేంద్రాల్లో 27,566 మంది, ఆంధ్రలోని నాలుగు కేంద్రాల్లో 9633 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
ఎంసెట్ కీ విడుదల
ఎంసెట్ కీని ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. ఈనెల 14 వరకు కీపై అభ్యంతరాలను స్వీకరిస్తామని కన్వీనర్ ప్రకటించారు. 16న ఫలితాలు ప్రకటిస్తారు.

చిత్రం... ఓయూలో పరీక్ష కేంద్రంలోకి వెళ్లేందుకు క్యూగట్టిన విద్యార్థులు