తెలంగాణ

రీ-డిజైన్‌ను అనుసరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: ప్రాజెక్టుల రీ-డిజైన్‌కు అనుగుణంగా కాలువలు, రిజర్వాయర్ల నిర్మాణం జరగాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. అలాగే గతంలో నిర్మించిన ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు రీ-డిజైన్ల ద్వారా ఆయకట్టు స్థిరీకరణ జరిగేలా కాల్వలు, ప్రాజెక్టులకు మరమ్మతులు నిర్వహించాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో ఆదివారం నీటిపారుదల శాఖ మంత్రి టి హరీశ్‌రావు, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, నీటి పారుదలరంగ ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్, ఎంపీలు కె కవిత, బిబి పాటిల్ తదితరులతో నిజాంసాగర్, శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులపై సిఎం సమీక్షించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కాల్వలన్నింటికీ వెంటనే మరమ్మతులు చేపట్టి 3 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాలని సిఎం ఆదేశించారు. ప్రాజెక్టుల రీ-డిజైన్ తర్వాత కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టుల వల్ల ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించడానికి అనుగుణంగా రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణం జరగాలని ఆదేశించారు. నిజామాబాద్ జిల్లాల్లో ప్రస్తుత సాగునీటి ప్రాజెక్టులైన నిజాంసాగర్, శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలని, పనులు వేగవంతంగా జరగాలని సూచించారు. నిజాంసాగర్ కింద గతంలో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని, కాల్వలు పాడైపోవడం, ముళ్ల చెట్లు పెరగడంతో కాలక్రమేణా ఆయకట్టు తగ్గుతూ వస్తుందన్నారు. తిరిగి మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా పనులు జరగాలన్నారు. కొత్తగా చేపట్టబోయే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నిజామాబాద్ జిల్లాకే ఎక్కువ నీరు రాబోతుందని, దానికి అనుగుణంగా మల్లన్న సాగర్ నుంచి నీరు తెచ్చేందుకు అనుగుణంగా రిజర్వాయర్లు, కాల్వలను నిర్మించాలని ఆదేశించారు. అంతరాష్ట్ర ప్రాజెక్టు అయిన లెండి ద్వారా నిజామాబాద్ జిల్లా జుక్కల్ నియోజకవర్గానికి సాగునీరు అందుతుందని, ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని, భూ సేకరణకు అవసరమైన నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా బాల్కొండ, ఆర్మూరు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు నీరు అందించడానికి జరుగుతున్న పనులను యథావిధిగా కొనసాగించాలని సిఎం సూచించారు. మిషన్ కాకతీయ కింద ఎక్కువ చెరువులు పునరుద్ధరణ జరగాలన్నారు.
నిజామాబాద్ జిల్లాకు అదనంగా 2000 ఇళ్లు
పేదల కోసం చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకంలో నిజామాబాద్ జిల్లాకు అదనంగా రెండు వేల ఇళ్లు మంజూరు చేయడానికి సిఎం అంగీకరించారు. ఒకేచోట కనీసం 50 ఇళ్లకు తక్కువకాకుండా నిర్మించే విధంగా లే అవుట్‌లను రూపొందించాలని నిజామాబాద్ జిల్లా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాజీవ్ గృహకల్ప పథకం కింద నిర్మించిన ఇళ్లు చాలాచోట్ల ఖాళీగా ఉన్నాయని, వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా విధానాన్ని రూపొందించాలని సిఎం ఆదేశించారు. బలహీన వర్గాల ఇళ్ల పథకంలో అవినీతిని నిరోధించాలని, అసలైన పేదలకు లాటరీ పద్ధతిలో లబ్థిదారుల ఎంపిక జరగాలని ఆదేశించారు. మహిళల పేర్లమీదనే ఇళ్ల కేటాయింపు జరగాలని సిఎం సూచించారు. రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ అందించడం కోసం చేపట్టిన పనులను ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తూ పనులు వేగంగా జరగేలా చూడాలని సూచించారు. కామారెడ్డిలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయాల నిర్మాణానికి అనువుగా స్థలాలను గుర్తించాలని అధికారులను సిఎం ఆదేశించారు.

చిత్రం... నీటి పారుదల ప్రాజెక్టులను సమీక్షిస్తున్న సిఎం కెసిఆర్