తెలంగాణ

గౌరవెల్లి, గండిపల్లికి రూ.1200 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోహెడ, నవంబర్ 20: హుస్నాబాద్ నియోజకవర్గంలో సాగునీటి సౌకర్యం కల్పించేందుకుగాను చేపట్టిన గౌరవెల్లి-గండిపెల్లి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.1200కోట్ల నిధులను మంజూరు చేసినట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీర్ హరీష్‌రావు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా కోహెడ మండలం పోరెడ్డిపల్లిలో పెద్ద వాగుపై రూ.11.15కోట్ల వ్యయంతో చెక్‌డ్యాం కం బ్రిడ్జి, రోడ్డు నిర్మాణం పనులకు శుక్రవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలో కరవు పరిస్థితులు ఉన్నాయన్నాని, శాశ్వత పరిష్కారానికి సాగునీటి కల్పనకై సిఎం కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధతో గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని, ఈ ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తిచేసి నీరందించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ ప్రాజెక్టు సామర్థ్యాన్ని సైతం 1.4టిఎంసిల నుండి 9టిఎంసిలు పెంచనున్నామని, దీంతో మరో 1600 ఎకరాలు ముంపునకు గురవుతాయని, బాధితులకు గతంలో కంటే త్వరగా కేవలం 15రోజుల్లో పరిహారం చెల్లిస్తామన్నారు. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల నిర్మాణానికిగాను రూ. 900కోట్ల అదనపు నిధులను కేటాయించడంతోపాటు గౌరవెల్లి నీటి సామర్థ్యాన్ని 0.5 నుండి 1.00 పెంచేందుకు మరో రూ. 300కోట్లు మంజూరు చేస్తున్నట్లు, మొత్తం రూ. 1200 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. గోదావరి వరద జలాల్ని ఆదా చేయడం ద్వారా ఈ ప్రాంత భూములన్నీ సస్యశ్యామలం చేయవచ్చునన్నారు. అలాగే చెక్‌డ్యాముల నిర్మాణం, మిషన్ కాకతీయలతో చెరువుల పునరుద్ధరణల వల్ల రాబోయే రోజుల్లో పల్లెసీమలు నీటితో కళకళలాడుతాయన్నారు. గత యేడు రూ.47 కోట్లతో 96 చెరువుల్ని పునరుద్ధరించగా, ఈ యేడు రూ.60కోట్లతో 117 చెరువుల మరమ్మత్తులు చేపడతామన్నారు. నియోజకవర్గంలో మిషన్ కాకతీయ రెండవ విడతలో 200 చెరువులకు మంజూరు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మండలంలోని సింగరాయ ప్రాజెక్టు, కాలువల అభివృద్ధికి మిషన్ కాకతీయ నిధులతో అభివృద్ధిపరుస్తామని హామీ ఇచ్చారు. శనిగరం మధ్య తరహా ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో అభివృద్ధిపర్చేందుకు అధికారులను నివేదికలు కోరామని తెలిపారు. ఎల్లంపల్లి జలాల్ని హైదరాబాద్‌కు తరలించే మార్గంలో మల్లారం వద్ద వాటర్ గ్రిడ్‌లో మంచినీటి శుద్ధి ద్వారా వృథా అయ్యే పదిశాతం నీరు శనిగరం చెరువులోకి మళ్లిస్తామని, దీంతో చెరువు నీటితో ఎప్పుడు కళకళలాడుతోందని మంత్రి చెప్పారు.

చిత్రం.. చెక్ డ్యాం పనుల శంకుస్థాపన ఫలకాన్ని
ఆవిష్కరిస్తున్న మంత్రి హరీశ్ రావు