తెలంగాణ

ఇక మెదక్ జిల్లాకే సింగూర్ జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, నవంబర్ 29: ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా సమర్పించడానికి సాహసోపేతమైన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నవంబర్ 29ని టిఆర్‌ఎస్ పార్టీ దీక్షా దీవస్‌గా నిర్వహిస్తోందని, ఈ శుభ సందర్భంలోనే తాగునీటి కోసం అలమటిస్తున్న మెదక్ జిల్లా ప్రజలకు ప్రభుత్వ కానుకగా సింగూర్ జలాలను జిల్లాకే సరఫరా చేయాలని నిర్ణయించిందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వెల్లడించారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల వల్ల జిల్లాలోని ప్రధాన జలాశయాలకు నీటి సమస్య ఎదురైందని, దశాబ్దాల కాలంగా జంటనగరాలకు తరలిస్తున్న మంజీర నీటిని నిలిపివేయాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేసారు.
నెల రోజులుగా సంగారెడ్డిలో నిలిచిపోయిన నీటి సరఫరాను పునరుద్ధరించడానికి సింగూర్ జలాలను జిల్లాకు కేటాయించాలని మంత్రి హరీష్‌రావు ద్వారా ముఖ్యమంత్రికి విన్నవించినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన సిఎం కెసిఆర్ మెట్రోవాటర్స్ అధికారులతో చర్చించి సింగూర్ జలాలను జిల్లాకే ఉపయోగించాలని ఆదేశించారని వివరించారు. సింగూర్ జలాశయంలో ప్రస్తుతం 1.5 టిఎంసిల నీరు ఉందని, ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటే జూన్ వరకు జిల్లాకు సరిపోతుందన్నారు. అవసరమైతే పాములపర్తి నుంచి గోదావరి నీటిని సరఫరా చేయడానికి కూడా సిఎం సానుకూలంగా ఉన్నారని తెలిపారు. కలెక్టర్ రొనాల్డ్ రాస్ సైతం జిల్లా ప్రజల నీటి అవసరాలను తీర్చడంలో ప్రత్యేక శ్రద్ద కనబర్చారన్నారు.

‘కెసిఆర్ వల్లే తెలంగాణ
కల సాకారమైంది’

హైదరాబాద్, నవంబర్ 29: కెసిఆర్ వల్లే తెలంగాణ కల సాకారమైందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం రవీంధ్రభారతిలో రేడియో ఎల్లయ్యమామ జానపద ఆకాడమీ రూపొందించిన కెసిఆర్ ఉద్యమ చరిత్ర సిడి ఆవిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండలి చైర్మన్ స్వామిగౌడ్, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, ఎంపి జితేందర్‌రెడ్డి పాటు పలువురు నేతలు ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ చేసిన ఉద్యమ చరిత్రను వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.