తెలంగాణ

ప్రశాంతంగా అసిస్టెంట్స్ పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29 : తెలంగాణలో 15/2015 నోటిఫికేషన్ ద్వారా ఆర్థిక - అకౌంట్స్ విభాగాల్లో అసిస్టెంట్ల నియామకానికి ఈ నెల 29వ తేదీన ఆబ్జెక్టివ్ పద్ధతిలో కంప్యూటర్ ఆన్ లైన్ ఒఎంఆర్ ఆధారితంగా ఎంపిక పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ తెలిపారు. ఈ పరీక్ష నిర్వహణకు 84 కేంద్రాలు ఏర్పాటు చేశామని, 55,239 మందికి హాల్‌టిక్కెట్లు జారీ చేశామని చెప్పారు. హైదరాబాద్‌లో 22 కేంద్రాల్లో 12,650 మంది, రంగారెడ్డిలో 21 కేంద్రాల్లో 15,180 మంది, కరీంనగర్‌లో 17 కేంద్రాల్లో 11,187 మంది, వరంగల్‌లో 24 కేంద్రాల్లో 16,222 మందికి హాల్‌టిక్కెట్లు జారీ చేశామని అయితే హైదరాబాద్‌లో 76.74 శాతం, రంగారెడ్డిలో 71 శాతం, కరీంనగర్‌లో 51.2 శాతం , వరంగల్‌లో 57.8 శాతం మంది పరీక్షకు హాజరయ్యారని వివరించారు. సగటున 64.2 శాతం పరీక్ష రాశారని, త్వరలోనే పరీక్ష తొలికీని విడుదల చేస్తామని, దానిపై అభ్యంతరాలుంటే ఆన్‌లైన్‌లో తెలియజేయవచ్చని, వాటిని పరిశీలించిన తర్వాత తుది కీ ఖరారు చేసి ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారు.
ట్రాన్స్‌కో పరీక్షకు 81%హాజరు
ట్రాన్స్‌కోలో ఎయి ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీర్ల పోస్టుకు జరిగిన రాత పరీక్షకు 81.41 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్టు ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హెచ్‌ఆర్ జి నరసింగరావు తెలిపారు. జెఎన్‌టియు ఆధ్వర్యంలో 53 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉద్యోగానికి పరీక్ష కోసం 39095 మంది దరఖాస్తు చేసుకొని 33097 మంది (84.66%)హాజరయ్యారు. సివిల్ ఇంజనీరింగ్‌లో 8153 మంది దరఖాస్తు చేసుకోని 5372మంది (65.85%)మంది హాజరయ్యారు.