తెలంగాణ

‘చే’జారుతున్న ‘స్థానిక’ ఓటర్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 2: నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార, విపక్ష పార్టీల గెలుపు ఎత్తుగడలు జోరందుకున్నాయి. టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నుండి అధికారికంగా అభ్యర్థులు ఎవరన్నది ఖరారు కాకపోయినప్పటికీ గెలుపు లక్ష్యంగా ఎంపిటీసిలు, జడ్పీటీసిలు, కౌన్సిలర్లను ఆకట్టుకునే ప్రయత్నాలను మాత్రం అప్పుడే మొదలు పెట్టారు. మంత్రి జి.జగదీష్‌రెడ్డి మార్గదర్శకత్వంలో క్యాంపు రాజకీయాలకు తరలిచ్చి ఎంపిటీసిలను, జడ్పీటిసిలను, కౌన్సిలర్లను రహస్య క్యాంపులకు తరలించడం ఆరంభించింది. మెజార్టీ ఓటర్లను క్యాంపులకు తరలించే లక్ష్యంతో ఓటర్లు కోరిన కోరికలన్నీ తీరుస్తు వారిని తమ క్యాంపుల్లోకి తీసుకెళ్లేందుకు అన్ని తాయిలాలు అందిస్తున్నారు. వారితో పాటు వారి భార్య, పిల్లలను, మహిళా ప్రజాప్రతినిధులైతే భర్తలను సైతం వెంట తీసుకెళ్లే ఫ్యామిలీ ప్యాకేజ్ టూర్ సౌకర్యం కల్పిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు సైతం తమకు ఇదే భలే మంచి చాన్స్ అనుకుంటు పోలోమంటు ఎమ్మెల్సీ అభ్యర్థులు పెట్టిన వాహనాల్లో ఎక్కి క్యాంపులకు తరలిపోతున్నారు. అభ్యర్థుల ఖర్చుతో తమకు మంచి విహార యాత్రలు, విందు, వినోదాలు దక్కుతున్నాయనుకుంటూ వారు లోలోన సంతోషిస్తున్నారు. బెంగుళూర్, కేరళా, గోవాలకు ప్రస్తుతం టిఆర్‌ఎస్ స్థానిక ఓటర్లు క్యాంపులకు వెళ్లారు. క్యాంపు, టూర్ ఖర్చుతో పాటు ప్రతి స్థానిక ఓటర్‌కు ప్రత్యేక ప్యాకేజి చెల్లింపు సైతం ఉండనే ఉంది. టిఆర్‌ఎస్ తరుపున అభ్యర్థిగా అనధికారికంగా ఖరారైన తేరా చిన్నపరెడ్డి స్థానిక ఓటర్ల క్యాంపు ఖర్చుల బాధ్యత మోస్తున్నట్లుగా ఆ పార్టీ వర్గాల సమాచారం. గతంలో జిల్లా ప్రణాళిక కమిటీ ఎన్నికల్లో 210మున్సిపల్ కౌన్సిలర్లలో కాంగ్రెస్‌కు 104మంది సంఖ్యా బలమున్నా మంత్రి జగదీష్‌రెడ్డి చక్రం తిప్పి టిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించిన వైనం కాంగ్రెస్‌ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో భయపెడుతుంది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్ధి ఎంపిక ఆలస్యమవుతుండటంతో ఆ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తుంది. మాజీ ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికే ఎమ్మెల్సీ టికెట్ లభిస్తుందని భావిస్తున్నప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ప్రకటన చేయకపోవడంతో ఆయన గెలుపు ప్రయత్నాల కార్యాచరణ అమలుకు ముందడుగు వేయలేకపోతున్నారు. ఇదే అదనుగా టిఆర్‌ఎస్ ఓటర్లను క్యాంపులకు తరలిస్తుండటం గమనార్హం. పనిలో పనిగా టిడిపి, బిజెపి, వామపక్షాల ఓటర్లను సైతం ఆకర్షిస్తు వారిని కూడా గులాబీ క్యాంపులకు తరలించే దిశగా ప్రయత్నిస్తున్నారు. సంఖ్యాపరంగా కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లలో మెజార్టీ ఉన్నా క్యాంపు రాజకీయాలతో టిఆర్‌ఎస్ ఎన్ని ఓట్లకు గండికొడుతుందోనన్న ఆందోళన హస్తం పార్టీని పీడిస్త్తోంది.
కాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల బాధ్యతలను పిసిసి, డిసిసిలకే అప్పగించడంతో నేడు గాంధీభవన్‌లో వారి సమావేశంలో అభ్యర్థి ఎంపికపై కీలక చర్చలు సాగనున్నాయి. ఎమ్మెల్సీ టికెట్ రేసులో ఉన్న ఆశావహులు రాజగోపాల్‌రెడ్డి, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, సుంకరి మల్లేష్‌గౌడ్‌లలో ఎవరిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిర్ణయిస్తారన్నదీ నేడు తేలనుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

టిఆర్‌ఎస్ శిబిరానికి తరలిపోతున్న ఎంపిటీసి, జడ్పీటీసి సభ్యులు, వారి కుటుంబ సభ్యులు

పాలమూరు పరువు

మీవల్లే పోతోంది

రెవెన్యూ అవినీతిపై కలెక్టర్ శ్రీదేవి ఆగ్రహం

ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, డిసెంబర్ 2: మీ వల్ల పాలమూరు జిల్లా పరువు పోతోందని, రెవెన్యూశాఖలో జరుగుతున్న అవినీతి ఏకంగా హైకోర్టుకు వెళ్లిందని, దాంతో హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యానాలు చేసిందని, ఇది జిల్లా రెవెన్యూ అధికారులకు సిగ్గుచేటని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి అధికారులపై ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. చేతకాకపోతే ఉద్యోగాలు వదిలి ఇంటికి వెళ్లండంటూ కనె్నర్ర చేశారు. రెవెన్యూశాఖ అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో గద్వాల డివిజన్ రెవెన్యూ అధికారులను ఉద్దేశించి కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విఆర్‌ఎలు, విఆర్‌ఓల అదుపులో ఉండరని, వీరిద్దరూ తహశీల్దార్ అదుపులో ఉండరని, తహశీల్దార్లు ఆర్డీఓల అదుపులో లేరని, ఆర్డీఓలు కూడా జిల్లా అధికారుల అదుపులో లేకుండా పోయారని అవినీతికి మారుపేరుగా మారారని అన్నారు. లంచాలు తీసుకోకుంటే బతలేరా అంటూ ఉద్యోగాలు చేయడానికి చేతకాకపోతే ఇంటికి వెళ్లిపోవాలని మండిపడ్డారు. జిల్లాలోని రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవినీతిపై హైకోర్టు స్పందించడం అంటే ఆషామాషీ విషయం కాదని, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పరువు పోయిందని, ఇందుకు ప్రధాన కారకులు మీరేనంటూ సమావేశానికి హాజరైన రెవెన్యూ అధికారులను కలెక్టర్ దుయ్యబట్టారు. అవినీతిని అరికట్టి ప్రజలకు సుపరిపాలన అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉంటే మీరేం చేస్తున్నారో మనస్సాక్షిగా అర్థం చేసుకోవాలని హితవు పలికారు. డీలర్లకు నిత్యావసర సరుకుల కింద ఒక ఆర్‌ఓ మాత్రమే జారీ చేయాలని, ఒకటి కంటే ఎక్కువ ఆర్‌ఓలు జారీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాంకిషన్, డిఎస్‌ఓ రాజారాం, సివిల్ సప్లై డిఎం ప్రసాద్‌రావు, గద్వాల ఆర్డీఓ హమీద్, కలెక్టర్ ఎఓ రఘోత్తమరావు తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ అధికారుల సమావేశంలో
మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి