తెలంగాణ

మార్కెట్ యార్డులకు మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: రాష్ట్రంలోని 44 వ్యవసాయ మార్కెట్ యార్డులను జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఎన్‌ఎఎం)తో అనుసంధానం చేయబోతున్నట్టు మార్కెటింగ్, నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు. జాతీయ వ్యవసాయ మార్కెట్‌తో మార్కెట్ యార్డులను అనుసంధానం చేయడం వల్ల రైతు పండించే ధాన్యానికి దేశంలో ఎక్కువ ధర ఎక్కడ ఉంటే ఆ ధరకు విక్రయించుకునే వెసులుబాటు కలుగుతుందని మంత్రి చెప్పారు. బోయినపల్లి మార్కెట్ యార్డులో ‘మన కూరగాయాలు’ భవన సముదాయాన్ని. హమాలీ కార్మికుల విశ్రాంతి భవనానికి బుధవారం మంత్రి ప్రారంభోత్సం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని మార్కెట్ యార్డులను దశల వారీగా జాతీయ వ్యవసాయ మార్కెట్‌తో అనుసంధానం చేస్తామని, దీని వల్ల రైతు పండించిన పంటకు మంచి ధర లభిస్తుందన్నారు. హైదరాబాద్‌లోని మూడు మార్కెట్‌లలో ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టడం కేవలం మూడు నెలలల్లోనే రూ.2.69 కోట్ల ఆదాయం పెరిగిందని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో రూ. 1024 కోట్ల వ్యయంతో 330 గోదాములను నిర్మిస్తున్నామని, వీటి వల్ల 17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిలువ చేసుకునే సామార్ధ్యం ఏర్పడుతుందని మంత్రి తెలిపారు. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లభించే వరకు నిలువ ఉంచుకోవడానికి గతంలో గోదాములు లేకపోవడం వల్ల తక్కువ ధరకు విక్రయించాల్సి పరిస్థితి వచ్చేదని దీని వల్ల పెట్టుబడి కూడా వెళ్లక రైతులు ఆర్థికంగా చితికిపోయేవారని మంత్రి వివరించారు. అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో గోదాముల నిర్మాణం జరగుతుందని మంత్రి చెప్పారు.
దేశంలోనే అన్ని రకాల మార్కెటింగ్‌కు హైదరాబాద్ అనుకూలంగా ఉండటంతో పెట్టుబడులు పెట్టేవారు హైదరాబాద్ బాట పట్టారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఢిల్లీలో పొగమంచు, చెన్నైలో వరదలు, వైజాగ్‌లో తుఫాన్లు వంటవి తరచూ వస్తుండటం వల్ల పెట్టుబడులు హైదరాబాద్‌కు తరలి వస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు.
ఉల్లిగడ్డ ధర ఆకాశానికి ఎగభాకినప్పుడు మార్కెటింగ్‌శాఖ సబ్సిడీ ధరలపై ప్రజలకు విక్రయించిందని, ప్రస్తుతం అదే పరిస్థితి కందిపప్పుకు తలెత్తడంతో పౌర సరఫరాల శాఖతో కలిసి సబ్సిడీ ధరపై కందిపప్పును విక్రయించడానికి యోచిస్తున్నామని మంత్రి తెలిపారు. మార్కెట్ యార్డులలో పనిచేసే హమాలీ కార్మికులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఇప్పించడానికి కృషి చేయనున్నట్టు ఆయన చెప్పారు. అలాగే హమాలీలకు ఇఎస్‌ఐ ద్వారా వైద్యాన్ని అందించడానికి కృషి చేస్తున్నామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోనే అతి పెద్ద గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ చిన్నదైపోవడం వల్ల దానిని రంగారెడ్డి జిల్లా కోహెడకు తరలించబోతున్నట్టు మంత్రి చెప్పారు. వంద ఎకరాల విస్థీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో దానిని నిర్మిస్తామని, కాయలను కృత్రిమంగా మాగబెట్టడానికి అవలంభిస్తున్న కార్బయిడ్ వాడకానికి ఇక్కడ అవకాశం లేకుండా చేస్తున్నామని మంత్రి వివరించారు. కార్బయిడ్‌కు ప్రత్యామ్నాయంగా రైపరింగ్ చాంబఱ్‌‌సను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు టి పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, నాయిని నరసింహారెడ్డి, మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ శరత్ తదితరులు పాల్గొన్నారు.
chitram...
హమాలీలకు దుస్తులు అందిస్తున్న మార్కెటింగ్ మంత్రి హరీశ్