తెలంగాణ

ఏడుగురు దొంగల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, డిసెంబర్ 11: తుపాకులతో బెదిరించడం, సెటిల్‌మెంట్లు చే స్తూ అక్రమంగా సంపాదిస్తున్న ఏడుగురు సభ్యుల దొంగల ముఠాను మెదక్ జిల్లా పోలీసులు నాలుగు ప్రాంతాల్లో అరెస్టు చేసారు. వీరి నుంచి సుమారు 53 తులాల బంగా రు ఆభరణాలు, రెండు 8 ఎంఎం పిస్టళ్లు, మందుగుండ్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఈ అరెస్టులకు సంబంధించిన వివరాలు ఎస్పీ బి.సుమతి వెల్లడించారు. దుబ్బాక మండలం ధర్మాజీపేట క్రాస్ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి అనుమానస్పదంగా కనిపించడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా మిరుదొడ్డి మండ లం రుద్రారం గ్రామానికి చెందిన గోరింటి రమేశ్‌రెడ్డిగా గుర్తించారు. అతన్ని సోదా చేయగా 8 ఎంఎం పిస్టల్, ఐదు రౌండ్ల మందుగుళ్లు ల భించాయి. ఈ ఆయుధం చూపించి దుబ్బాక ప్రాంతంలోని వ్యాపారస్తులను బెదిరించి సెటిల్‌మెంట్ చేయుటకు ఉపయోగిస్తున్నట్లు అంగీకరించారు. తొగుట పోలీసులు చెర్యా ల క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఒక ప్యాసింజర్ ఆటోలో వస్తు న్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి ఆటో దిగి పారిపోతుండగా వెంబడించి పట్టుకుని విచారించగా వరంగల్ జిల్లా చెర్యాల మండలం ఐనాపూర్ గ్రామానికి చెందిన బురు గు శ్రీనివాస్‌గౌడ్, గానబోయిన నర్సింలుగౌడ్, కోహెడ సత్యనారాయణగౌడ్‌గా గుర్తించారు. వీరు కొన్ని సంవత్సరాలుగా తమ వద్ద ఉన్న 8 ఎంఎం పిస్టల్ చూపిస్తూ చెర్యాల్, సిద్దిపేట ప్రాంతాల్లో వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ వివిధ సెటిల్‌మెంట్లు చేసినట్లు వెల్లడైంది. వీరి వద్ద ఉన్న పిస్టల్‌ను నంగునూర్ మండలం వెల్కటూర్ గ్రామానికి చెందిన వెంకటస్వామిగౌడ్ అలియాస్ రామస్వామి అనే వ్యక్తి ఇచ్చినట్లు సమాచారం ఇచ్చారు. నర్సింలు వద్ద ఉన్న పిస్టల్‌తో పాటు నాలుగు రౌండ్ల మందు గుండ్లు మందుగుండ్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, రామచంద్రాపూర్ పోలీసులు బిహెచ్‌ఇఎల్ ప్రధాన గేటు వద్ద అనుమానస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు లభించాయి. వీరిని విచారించగా టేక్మాల్ మండలం అచ్చన్నపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని హసన్‌మొహ్మద్‌పల్లి తండాకు చెందిన కుంసోతు రవి, దేవసోతు గేమ్యాలుగా గుర్తించారు. వీరినుంచి 44 తులాల బంగారు ఆభరణాలు, అర కిలో వెండి ఆభరణాలు సుమారు 11 లక్షల విలువ చేసే సొత్తును స్వా ధీనం చేసుకున్నారు. మహారాష్టక్రు చెందిన కరుడుగట్టిన నేరస్తుడు బింగి మాధవరావ్‌ను జహీరాబాద్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఇతను సెప్టెంబర్ నెలలో రంజోలు గ్రామానికి చెందిన వెంకట్ ఇంట్లో చొరబడి బంగారు, వెండి ఆభరణాలు, 5 వేల నగదు, మరో ఇంట్లో 5 వేల నగదును ఎత్తుకెళ్లాడు. నిందితుడి నుంచి బంగారు గుండ్లతో పాటు ఇతర నేరా ల్లో అపహరించిన 8 తులాల బంగారం, 50 తులాల వెండి ఆభరణాలు స్వాధీనపర్చుకున్నారు.

కరుడుగట్టిన ఇద్దరు దొంగలను విలేఖరుల ముందు ప్రవేశపెట్టిన
ఎస్పీ సుమతి, స్వాధీనం చేసుకున్న బంగారు, వెండి ఆభరణాలు