తెలంగాణ

వచ్చే విద్యాసంవత్సరం మార్చి 22నుంచే ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరాన్ని జూన్ నెలలో కాకుండా మార్చి నుంచే ప్రారంభం కానుంది. 2016 మార్చి 22 నుండి కొత్త విద్యా సంవత్సరం మొదలవుతుంది. దానికి అనుగుణంగా 2016-17 విద్యాసంవత్సర ప్రణాళికను అధికారులు రూపొందించారు. 2016 మార్చి 7 నుండి 14వ తేదీ వరకూ 1వ తరగతి నుండి 9వ తరగతి వరకూ విద్యార్ధులకు వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. 10వ తరగతి పరీక్షలు మార్చి 21న ప్రారంభం అవుతాయి. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మార్చి 20 తర్వాత సెలవులు ఇవ్వాలని తొలుత భావించినా, ప్రభుత్వం దానిని మార్చింది. టీచర్లు 20వ తేదీలోగా జవాబు పత్రాలు మూల్యాంకనం చేసి, మార్చి 21న స్కూళ్లను ప్రారంభించి, అదే రోజు విద్యార్ధులకు ప్రగతి పత్రాలను అందించాల్సి ఉంటుంది.
మరుసటి రోజు నుంచి తదుపరి విద్యాసంవత్సరాన్ని ప్రారంభిస్తారు. అవి దాదాపు నెల రోజుల పాటు కొనసాగిన తర్వాత ఏప్రిల్ 24 నుండి జూన్ 12 వరకూ వేసవి సెలవులు ఇస్తారు. మైనార్టీ స్కూళ్లకు ఈ నెల 24 నుండి 30వ తేదీ వరకూ సెలవులు ఇస్తారు. సంక్రాంతి సెలవులు జనవరి 11 నుండి 17 వరకూ ఇస్తున్నారు.