తెలంగాణ

మోహన్ రెడ్డి, అనుచరులను కోర్టులో హాజరుపర్చిన జైలు అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీగల్ (కరీంనగర్), డిసెంబర్ 18: నగరంలోని కెన్‌క్రెస్ట్ విద్యాసంస్థల అధినేత రామవరం ప్రసాదరావు ఆత్మహత్య కేసులో ఆయన భార్య గోమతి ఇచ్చిన ఫిర్యాదుపై కరీంనగర్ రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ప్రధాన నిందితుడైన ఎఎస్‌ఐ మోహన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులైన సింగిరెడ్డి కరుణాకర్ రెడ్డి, సింగిరెడ్డి జితేందర్ రెడ్డి, సిఐడి కానిస్టేబుల్ కెక్కెర్ల పర్శరాములు, అకౌంటెంట్ జ్ఞానేశ్వర్, సర్ధార్ పర్మిందర్ సింగ్, ముల్కల హరీష్‌లపై కేసు నమోదు చేశారు.
ఆయా కేసుల్లో శుక్రవారం కరీంనగర్ అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి మాధవి ఎదుట జైలు అధికారులు హాజరుపర్చారు. హైదరాబాద్ అల్వాల్‌కు చెందిన దోనపాటి వెంకటరమణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సిఐడి పోలీసులు మోహన్ రెడ్డితో పాటు ఇట్టిరెడ్డి శ్రీపాల్ రెడ్డి, పుర్మ శ్రీ్ధర్ రెడ్డి, హన్మాండ్ల సుమన్ రెడ్డిలను కోర్టులో హాజరుపర్చారు. మరో కేసులో చాట్ల కొమురయ్య ఫిర్యాదుపై మోహన్ రెడ్డిని హాజరుపర్చారు. అనంతరం ఈ కేసును ఈ నెల 31 వరకు రిమాండ్ గడువు పొడిగించారు. కాగా 50 రోజుల నుండి జిల్లా కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎఎస్‌ఐ మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు కొంత సమయం ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని న్యాయమూర్తి మాధవి ఎదుట పెట్టుకున్న అభ్యర్థనను అంగీకరించడంతో తన తండ్రి, భార్య, కుమారుడితో కాసేపు మాట్లాడారు. అనంతరం జైలు పోలీసులు భద్రత మధ్య జైలుకు తరలించారు.
మరో ముగ్గురు
రైతుల ఆత్మహత్య
మోతె / మరిపెడ / చేర్యాల, డిసెంబర్ 18: అప్పుల బాధతో మరో ముగ్గురు రైతులు శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. మెదక్ జిల్లా మోతె మండలం సిరికొండ గ్రామానికి చెందిన రైతు కాంపాటి చంద్రయ్య (70) పురుగుల మందు తాగి ఉసురు తీసుకొన్నాడు. చంద్రయ్య తన ఎకరం పొలంతో పాటు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని పంటలు వేయగా అవి పండక, తెచ్చిన అప్పు తీర్చలేక తన వ్యవసాయబావి వద్ద పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించగా సూర్యాపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. భార్య పూలమ్మ ఫిర్యాదుమేరకు కేసు దర్యాప్తు చేసినట్లు ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపారు. వరంగల్ జిల్లాలో మరో ఇద్దరు ఆత్మహత్య చేసుకొన్నారు. మరిపెడ మండలం బీచురాజుపల్లి శివారు జర్పుల తండాకు చెందిన జర్పుల దస్రు (40) అప్పుల బాధతో ఇంటి ఆరుబయట ఉన్న విద్యుత్ తీగలను పట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇదే జిల్లా చేర్యాల మండలం అయనాపూర్‌కు చెందిన దండ్యాల తిరుమల్‌రెడ్డి (36) అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నాడు. వర్షాభావ పరిస్థితుల్లో పంటలు పండక అప్పులు పెరిగిపోవడంతో మనస్తాపం చెంది బావివద్దకు వెళ్లి పురుగుల మందు తాగగా చికిత్స కోసం చేర్యాలకు తరలిస్తున్న క్రమంలో మృతిచెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.
వరంగల్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న
రైతు తిరుమల్‌రెడ్డి