తెలంగాణ

అప్పుడెందుకు అడగలేదు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 25:తెలంగాణకు జరిగిన అన్యాయంపై అప్పుడు ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ఎందుకు మాట్లాడలేకపోయారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లేష్‌గౌడ్ తన అనుచరులతో పాటు శుక్రవారం తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని జానారెడ్డి ఎప్పుడూ ప్రశ్నించలేదని అన్నారు. కెసిఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ కోసం కృషి జరుగుతున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే ప్రజలు పార్టీని ఆదరిస్తున్నారు, అదే విధంగా ఇతర పార్టీలకు చెందిన వారు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఆయన అన్నారు. జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కెసిఆర్ ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. ఇంటింటికి తాగునీటి పథకం ద్వారా జిల్లా ప్రజలకు సురక్షితమైన తాగునీరు లభిస్తుందని అన్నారు. ఫ్లోరైడ్ కష్టాలు మిషన్ భగీరథతో తీరిపోతాయని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లగొండలో టిఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఏప్రిల్ నుంచి వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. నియోజక వర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలనే ఎన్నికల ప్రణాళికలోని హామీని అమలు చేసి చూపిస్తామని అన్నారు.
మల్లేష్ గౌడ్‌కు, ఇతర నాయకులకు జగదీశ్‌రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బంగారు తెలంగాణ కోసం తన వంతు కృషి చేస్తానని, తెలంగాణ అభివృద్ధి కోసం పార్టీలో చేరినట్టు మల్లేష్‌గౌడ్ తెలిపారు.