తెలంగాణ

అయుతం పరిపూర్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సంగారెడ్డి, డిసెంబర్ 27: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం సుభిక్షాన్ని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్వహించిన అయుత మహా చండీయాగం వైభవోపేతంగా పరిసమాప్తం అయింది. తన చండీయాగ సంకల్పం నెరవేరాలని, నిర్విఘ్నంగా కొనసాగాలని ఆశీర్వదించిన శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ మహాస్వామితో సహా ఎందరో మహాభావులకు పేరు, పేరున సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నానని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.
ఈ నెల 23 నుంచి ఐదురోజులుగా రుత్విజుల మంత్రోచ్చారణలు, జప, తాపాలతో జగన్మాథ, జగత్ జననీ, లోకపావని కటాక్ష వీక్షణాల కోసం రుత్విజులు ఎంతో నిష్టతో యాగాన్ని నిర్వహించారు. దేశంలోనే పేరుగాంచిన పీఠాధిపతులు, మఠాధిపతులు యాగస్థలికి విచ్చేసి యాగకర్త కెసిఆర్‌ను ఆశీర్వదించారు. రుత్విజులు నియమ నిష్టాగరిష్టతో చేపట్టిన యాగం చివరి రోజైన ఆదివారం స్వల్ప అగ్నిప్రమాదం మినహా ప్రశాంత వాతావరణంలో అట్టహాసంగా ముగిసింది. యాగం ముగింపు చివరి రోజు అమ్మవారి దర్శనం కోసం లక్షలాది భక్తులు తండోప తండాలుగా తరలివచ్చారు. ఐదు రోజులుగా చతుర్వేద పారాయణం, చండీమాత మంత్రోచ్ఛారణలతో వేదశాల మారుమ్రోగింది.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి చండీ ఉపాసన చేసిన వేలాది మంది రుత్విజులను ఈ మహత్కార్యంలో పాల్గొన్నారు. లక్షలాది మంది భక్తులకు ఇబ్బంది లేకుండా వీక్షించేందుకు వీలుగా, జగద్గురువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు వంటి ప్రముఖుల కోసం విడది కుటీరాలు, నయనానందకరంగా యాగశాల నిర్మాణాలు అమితంగా ఆకట్టుకున్నాయి. పురాణ, ఇతిహాసాల్లోని వన కుటీరాల నమూనాలు, విద్యుత్ దీపాల అలంకరణలతో యాగశాలను తీర్చిదిద్ది నభూతో న భవిష్యతీగా తీర్చిదిద్ది భక్తులను తన్మయత్వానికి గురి చేసారు. సంప్రదాయ కట్టుబాట్లు, కఠినమైన ఉపాసనతో ఐదు రోజుల పాటు రుత్విజులు యాగశాలను దాటి బయటకు రాకుండా వారికి అక్కడే అన్ని సదుపాయాలు కల్పించారు. అలాగే యాగ వైభోగాన్ని కనులారా వీక్షించడానికి తరలివచ్చిన లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భోజన సదుపాయాలు కల్పించారు.
జనసంద్రంగా మారిన యాగస్థలం
గజ్వేల్: సిఎం కెసిఆర్ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం వద్ద అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అయుత చండీ యాగం నిర్విఘ్నంగా ముగియగా ఆద్యంతం అధ్యాత్మికతను స్ఫురింపజేసింది. ముఖ్యంగా రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు యాగ స్థలానికి తరలిరావడంతో కుంభమేళాను తలపింప జేసింది. కాగా యాగస్థలిలో ప్రతినిత్యం చేపట్టిన కుంకుమార్చనలు మహిళలను విశేషంగా ఆకట్టుకోగా వేలాది మంది మహిళలు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
అయితే ఎర్రవల్లి పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారిపోగా, రహదారులు వాహనాల రాకపోకలతో క్రిక్కిరిసి స్తంభించి పోయాయి. యాగ నిర్వహణ, విజయవంతానికి గురుతర బాధ్యతను తీసుకున్న మంత్రి హరీశ్‌రావు అన్నీతానై ముందు కెళ్ళగా విఐపి, వివిఐపిలతో పాటు అధ్యాత్మిక వేత్తలను స్వాగతించే బాధ్యతను చేపట్టారు.
అలాగే యాగ పరిసర ప్రాంతాలతో పాటు దారిపొడవునా ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలు యాగస్థలి అందాలను ద్విగుణీకృతం చేయగా లక్షలాది మంది భక్తులను ధవళకాంతులు విశేషంగా ఆకట్టుకున్నాయ. కాగా ప్రతినిత్యం నిర్వహించిన గురుప్రార్థన, గోపూజ, గణపతి పూజ, ఏకాదశ న్యాసపూర్వ త్రి సహస్ర చండీ పారాయణం, నివారణ పూజ, నవగ్రహ హోమము, యోగిని బలి, రాజ్య శ్యామల మహా యాగంను అత్యంత నియమ నిష్టలతో జరుగగా, తెల్లవారు జామునుండే భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడం కనిపించింది. అయితే భక్తులకు మహాప్రసాదం అందించేందుకు యాగకర్త సిఎం కెసిఆర్ తీసుకున్న చర్యలపట్ల భక్తులు సంతృప్తి చెందగా, ప్రతి నిత్యం భోజనశాల ఇన్‌చార్జి చీటి రామారావు నేతృత్వంలో 500మంది మంథని బ్రాహ్మణులు శ్రమించి శుచి, రుచికరమైన భోజనాలను అందించారు.