తెలంగాణ

నెలకు 2వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 4: ప్రస్తుత ఆర్థిక బడ్జెట్‌లో నీటిపారుదల ప్రాజెక్టులకు కేటాయించబోయే రూ.25 వేల కోట్లలో ప్రతీ నెలా రూ. 2,083 కోట్లు విడుదల చేస్తామని, దానికి అనుగుణంగా పనులు జరగాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. కృష్ణా, గోదావరి నదులపై తలపెట్టిన ప్రాజెక్టుల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలన్నారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం నీటిపారుదల మంత్రి టి హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు, ముఖ్య కార్యదర్శి ఎస్‌కె జోషి, ఈఎన్‌సి మురళీధర్‌రావు, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డిలతో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. పాలమూరు ఎత్తిపోతల, డిండి ప్రాజెక్టు, అలాగే పెన్‌గంగ ప్రాజెక్టుకు వెంటనే టెండర్లు ఆహ్వానించాలని ఆదేశించారు. రెండువారాల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని, పనుల్లో వేగం పెంచడానికి, త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్‌స్థాయి అధికారులకు కూడా అధికారాలను బదలాయించాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి జోషిని ఆదేశించారు. నీటిపారుదల ప్రాజెక్టుల పనులు ఇక వేగవంతంగా జరగాలని, ప్రతీ నెలా రూ.2,083 కోట్లు వీటికోసం విడుదల చేస్తామని, అందుకు అనుగుణంగా పనులు జరగడానికి ప్రణాళికలు రూపొందించాలని సిఎం సూచించారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన రీ- డిజైన్ పూర్తి కావడంతో ప్రాజెక్టుల పనులన్నీ వెంటనే సమాంతరంగా ప్రారంభంకావాలని ఆదేశించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పరిధిలోని ఏదుల, కర్వెన డిస్ట్రిబ్యూషన్ పనులకు టెండర్లు ఆహ్వానించాల్సిందిగా ఈఎన్‌సి మురళీధర్‌రావును ఆదేశించారు. అలాగే ఇదే ప్రాజెక్టు పరధిలోని ఉద్దండపూర్ పనులకు సంబంధించి కూడా సైజులు, డిజైన్లు ఖరారు చేయాలన్నారు. మేడిగడ్డ వద్ద కాళేశ్వరం బ్యారేజీకి త్వరలో శంకుస్థాపన చేసి, ఈ ఏడాది జూన్ వరకు కాళేశ్వరం బ్యారేజీ నుంచి ఎల్లంపల్లికి నీరు చేరేలా పనులు జరగాలని సిఎం కెసిఆర్ సూచించారు.

చిత్రం... నీటిపారుదల శాఖ ఉన్నతస్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సిఎం కెసిఆర్