తెలంగాణ

కోకాపేట.. కెవ్వుకేక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 25: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్‌లో రియల్ ఏస్టేట్ బూమ్ పడిపోతోందన్న ప్రచారంలో వాస్తవం లేదని నిరూపితమైంది. నగరంలో మునుపెన్నడూ లేనివిధంగా కోకాపేట, మణికొండ, రాయదుర్గం ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఎకరం భూమి ధర రూ. 29.28 లక్షలు పలికింది. రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ నిరర్ధక భూములను వేలం వేసే బాధ్యతను తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌కు (టిఎస్‌ఐసిసి) ప్రభుత్వం అప్పగించింది. వీటిని బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా టిఎస్‌ఐసిసి వేలం పాటలు నిర్వహించింది. వేలానికి పెట్టిన వాటిలో రాయదుర్గం భూములు వాణిజ్య అవసరాల కోసం వినియోగించేవి కాగా, కోకాపేట, మణికొండ భూములు నివాసయోగ్య నిర్మాణాల కోసం ఉద్దేశించినవి. రాయదుర్గంలో భూమిని ఎకరాకు రూ. 29.28 కోట్ల చొప్పున వేలం పాడి ఐదు ఎకరాలను అరబిందో ఫార్మా దక్కించుకుంది. హైదరాబాద్ నగరంలో ఇంత పెద్ద మొత్తం భూమి అమ్మడుపోవడం ఇదే ప్రథమం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో 2007-089లో రియల్ ఏస్టేట్ భూమ్ బాగా పలికినప్పుడు రాయదుర్గంలో ఎకరాకు రూ. 18 కోట్ల నుంచి రూ. 23 కోట్ల ధర పలికింది. ప్రస్తుతం అక్కడి భూమికే నిర్వహించిన వేలంలో ఎకరాకు రూ. 29.28 కోట్లు పలికి అత రికార్డులను బద్ధలు కొట్టింది. ఇంత పెద్ద మొత్తంలో వేలం పాడి ఐదు ఎకరాలు దక్కించుకున్న అరబిందో ఫార్మా కంపెనీయే రాయదుర్గంలో ఎకరాకు రూ.24.88 కోట్ల చొప్పున వేలం పాడి మరో 3.65 ఎకరాలను దక్కించుకోగా, నయా ఇన్‌ఫ్రా కంపెనీ రూ.24.20 కోట్ల చొప్పున రెండు ఎకరాలు కొనుగోలు చేసింది. సైమెడ్ ల్యాబ్స్ కంపెనీ ఎకరాకు రూ.22.02 కోట్ల చొప్పున 3 ఎకరాలు కొనుగోలు చేసింది. ఇంత పెద్ద మొత్తంలో కోట్లు చెల్లించి దక్కించుకున్న భూముల్లో ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడానికి కొనుగోలు చేసినట్టు వేలం పాటల్లో పాల్గొన్న కంపెనీల ప్రతినిధులు చెప్పారు. అలాగే మణికొండలో నివాస గృహాలను నిర్మించడానికి ఎర్త్ పేవర్స్ కంపెనీ ఎకరాకు రూ. 12.63 కోట్ల చొప్పున, కోకాపేటలో గ్లాండ్ సెల్యులోజ్ కంపెనీ ఎకరాకు రూ. 6.05 కోట్ల చొప్పున కొనుగోలు చేసింది. రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూములను వేలం వేయడానికి టిఎస్‌ఐసిసి గత నెల 30న ఆన్‌లైన్ వేలం పాటలకు ఈ-టెండర్ కమ్ ఈ-యాక్షన్ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనకు అనూహ్యంగా అత్యధిక సంఖ్యలో ఔత్సాహికులు బిడ్డింగ్‌లో పాల్గొన్నట్టు టిఎస్‌ఐసిసి మేనేజింగ్ డైరెక్టర్ ఇవి నర్సింహరెడ్డి తెలిపారు.