తెలంగాణ

చెరువులకు యునిక్ కోడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: మిషన్ కాకతీయ పైలాన్ ప్రారంభోత్సవానికి వచ్చేనెల మొదటివారంలో ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్‌లో పర్యటించనున్నారు. ప్రధాని పదవి చేపట్టిన తరువాత, తెలంగాణ ఆవిర్భావం తరువాత నరేంద్ర మోదీ తొలి పర్యటన ఇది. ఇప్పటివరకు వివిధ కార్యక్రమాలకు నరేంద్ర మోదీని మూడుసార్లు ఆహ్వానించినా రాలేదని తెరాస ఇటీవల బిజెపిపై విమర్శలు ప్రారంభించింది. తెలంగాణపట్ల మోదీ వివక్ష చూపుతున్నారని, తెలంగాణ ప్రజలకు ఆయన ముఖం చూపించలేదని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచార సభల్లో మంత్రి కెటిఆర్ పలు సందర్భాల్లో విమర్శించారు. ఆహ్వానించకపోవడం వల్లే ప్రధాని రాలేదని బిజెపి నేతలు సమాధానం చెప్పారు. అయితే మూడు కార్యక్రమాల కోసం ఆహ్వానించినా రాలేదని తెరాస మంత్రులు వాదిస్తూ వచ్చారు. ఇప్పుడు మిషన్ కాకతీయ పైలాన్ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని సిఎం కెసిఆర్ కోరడంతో ప్రధాని నరేంద్ర మోదీ సుముఖత వ్యక్తం చేశారని హరీశ్‌రావు ప్రకటించారు. వరంగల్‌లో ఫిబ్రవరి మొదటివారంలో మిషన్ కాకతీయ పైలాన్ ఆవిష్కరణ జరుగుతుందని, ప్రధాని హాజరవుతారని నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో మిషన్ కాకతీయపై హరీశ్‌రావు సమీక్ష జరిపారు.
ప్రతి చెరువుకు ఒక విశిష్ట సంఖ్య కేటాయించినట్టు సమీక్షలో హరీశ్‌రావు ప్రకటించారు. ఈవారంలో మూడువేల ట్యాంక్‌లకు అనుమతి ఇచ్చినట్టు చెప్పారు. దీనికి సంబంధించి సాంకేతిక మంజూరు, టెండరింగ్ ప్రక్రియకు సమాయత్తం కావాలన్నారు. ప్రతి జిల్లాకు ఒక చీఫ్ ఇంజనీర్‌ను నోడల్ అధికారిగా నియమించామని, రెగ్యులర్‌గా మిషన్ కాకతీయ పనులను వాళ్లు సమీక్షించాలని హరీశ్‌రావు కోరారు.
మార్చి 31వరకు మిషన్ కాకతీయ ఫేజ్ వన్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, దీనికోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ప్రతివారం మిషన్ కాకతీయపై జిల్లాల్లో సమీక్షలు జరపాలని, అలా జరిగితేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఈసారి మిషన్ కాకతీయ లక్ష్యం 10,308 చెరువులను పునరుద్ధరించడంగా వివరించారు. ఇప్పటి వరకు వీటిలో 50 శాతం అంచనాలు వచ్చినట్టు తెలిపారు. అంచనాలు రూపొందించేప్పుడు ప్రజలు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. గతంలోలా కాకుండా ఈసారి ముందునుంచే వీరిని భాగస్వామ్యం చేయాలని సూచించారు. మిషన్ కాకతీయ మొదటి ఫేజ్‌లో ఎవరైనా కాంట్రాక్టర్‌లు సహకరించకపోతే కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లకు సూచించారు. అవసరమైతే అలాంటివారిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలన్నారు. దీనివల్లే ఫేజ్2లో మంచి కాంట్రాక్టర్లు వచ్చే అవకాశం ఉందన్నారు. అటవీశాఖ ఎక్సైజ్ శాఖ సమన్వయంతో ప్రతి చెరువు గట్టుమీద ఈత చెట్లు పెంచాలని సూచించారు. జిల్లా ఇరిగేషన్ ప్లాన్‌లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
హన్మంతరావు ముఖాముఖి
సాగునీటి రంగంలో నిపుణులైన వారితో ఇంజనీర్లకు పాఠాలు చెప్పించాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. దీనిలో భాగంగా అంతర్జాతీయంగా సాగునీటి రంగంలో పేరుపొందిన రిటైర్డ సిఇ హన్మంతరావు ఇంజనీర్లకు పాఠాలు చెప్పారు. బిట్స్, ఐఐటిల సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించారు. వీరితో కలిసి మెరుగైన పద్ధతుల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. మిషన్ కాకతీయ అద్భుతమైన పథకమని హన్మంతరావు పేర్కొన్నారు. గతంలో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు గండ్లు పూడ్చడానికి మాత్రమే నిధులు కేటాయించేవారని ఇప్పుడు ప్రభుత్వం బండ్ పటుత్వానికి కూడా డబ్బులు కేటాయిస్తోందని తెలిపారు.