తెలంగాణ

అభివృద్ధి.. ఆంధ్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: పార్టీలు వేరు కానీ గ్రేటర్ ఎన్నికల్లో అన్ని పార్టీల నినాదాలు ఒకటే. ఇటు అభివృద్ధి, అటు ఆంధ్ర. ఈ రెండు నినాదాలపై అన్ని పార్టీలూ ఆశలు పెట్టుకున్నాయి. 18నెలల పాలనా కాలంలో తాము చేసిన అభివృద్ధిపై తెరాస ఆశలు పెట్టుకుంటే, తమ పాలనా కాలంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ కాంగ్రెస్, భాజపా- తెదేపా కూటమి ప్రచారం చేస్తోంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్‌లో తామేమి చేశామో వివరిస్తూ ఎంఐఎం ఈసారి అవకాశం కల్పించాలని కోరుతోంది. ఒకవైపు అభివృద్ధి నినాదమిస్తూ మరోవైపు ఎంఐఎం వినా మిగిలిన ప్రధాన రాజకీయ పక్షాలు ఆంధ్ర ఓటర్లపై బోలెడు ఆశలు పెట్టుకున్నాయ. హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న ఆంధ్ర ఓటర్లు 2014 సాధారణ ఎన్నికల్లో తెదేపా- భాజపా కూటమిని ఆదరించాయి. సహజంగా గ్రేటర్ ఎన్నికల్లోనూ ఈ ఓట్లు అదే కూటమికి పడతాయనే ఆంచనాలు ఉండేవి. కానీ తెరాస ముందు నుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఈ వర్గం మద్దతు కొంతవరకు సాధించింది. తుమ్మల నాగేశ్వరరావును మంత్రివర్గంలో చేర్చుకోవడం మొదలుకొని నగరానికి చెందిన తెదేపా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా తెదేపా- భాజపా ఓటు బ్యాంకుపై తెరాస కనే్నసింది. హైదరాబాద్‌లో అభివృద్ధికే ప్రాధాన్యతనిస్తూ ఆంధ్రవారిని సైతం కలుపుకొని పోయే విధంగా 18 నెలల్లో తెరాస నాయకత్వం చేసిన ప్రయత్నాలు కొంతవరకు ఫలించాయి. మిగిలిన అన్ని పార్టీలకన్నా ముందే తెరాస ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. ప్రభుత్వం ఏర్పాటు తరువాత సాధించిన అభివృద్ధి, భవిష్యత్తులో చేపట్టబోయే పథకాలపైనే ప్రధానంగా ప్రచారం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో తెరాస పదిమంది ఆంధ్ర ప్రాంతీయులకు టికెట్లు ఇచ్చింది. తొలిసారిగా ఒక మార్వాడీని సైతం రంగంలో నిలిపింది. తెరాస వ్యూహాత్మకంగా వ్యవహరించి మొదటి నుంచి పార్టీపట్ల పాజిటివ్ టాక్ వచ్చేలా చేసుకుంది. తెదేపా, భాజపా కూటమి ఓటు బ్యాంకుగా భావించిన ఆంధ్ర ప్రాంతం వారి ఓట్ల కోసం అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారి ఓట్లు ఏదో ఒక పార్టీకి గంప గుత్తగా పడే అవకాశలేమీ లేవు. ఆ ఓట్లపై తెరాస సైతం ఆశలు పెట్టుకుంది. ఆంధ్ర ప్రాంతంవారికి టికెట్లు ఇస్తాం, గెలిపించుకొంటాం అని మంత్రి కెటిఆర్ ముందుగానే ప్రకటించారు. చెప్పినట్టుగానే టికెట్లు ఇచ్చారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన పలు సంఘాలు, కుల సంఘాల సమావేశాల్లో కెటిఆర్ ప్రసంగించారు. ఇక కాంగ్రెస్ తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు చెబుతూ ఆంధ్ర ప్రాంతం వారి ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. ఆంధ్రుల ఓట్లను కెసిఆర్ ప్రభుత్వం తొలగిస్తోందంటూ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డినే తొలుత ఆందోళన చేశారు. దీంతో ఆంధ్ర ఓటర్లలో కాంగ్రెస్‌పై విశ్వాసం పెరిగిందని, తెదేపాకన్నా కాంగ్రెస్‌పైనే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారని ఆయన ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అయితే తీరా ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్‌కు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. తెదేపా- భాజపా కూటమిని 2014లో ఆంధ్ర ఓటర్లు ఆదరించారు. అయితే ఈసారి తెదేపా అధినేత చంద్రబాబు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సీరియస్‌గా ప్రచారం చేయకపోవడం వారికి నిరాశ కలిగించింది. బాబు విజయవాడలో మకాం వేయకముందు గ్రేటర్‌లో టిడిపి పరిస్థితి వేరుగా ఉండేది. బాబు మకాం మార్చిన తరువాత పార్టీ శ్రేణులు ఢీలా పడ్డారు. గ్రేటర్ ఎన్నికలను బాబు సీరియస్‌గా తీసుకోకపోవడం పార్టీ శ్రేణులకు నిరాశ కలిగిస్తోంది. అయితే ఆంధ్ర ఓటర్లలో ఎక్కువ మంది తెదేపా- భాజపా కూటమికే ఓటు వేస్తారని ఆ పార్టీలు నమ్మకంగా ఉన్నాయి. ఎంఐఎం ఈసారి పాత నగరంతో పాటు కొత్త నగరంపైనా దృష్టిసారించింది.