తెలంగాణ

కోటి ఎకరాలకు సాగు నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: గోదావరి, కృష్ణా జీవనదుల జలాలతో తెలంగాణ భూములు తడవాలి. పచ్చని పంటలతో నేల పరవశించాలి. రాష్ట్ర ప్రజలకు సుఖం, శాంతి చేకూరాలని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహాన్ ఆకాంక్షించారు. మంగళవారం సికిందరాబాద్ పరెడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ నరసింహాన్ మాట్లాడారు. 19నెలల కాలంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించడంతోపాటు ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలను వివరించారు. 1,31,988 కోట్ల రూపాయల వ్యయంతో 34 భారీ, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించనున్నట్టు తెలిపారు. ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఏటా 25వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. కృష్ణా, గోదావరి జలాలను ఉపయోగించుకుని సాగు, తాగునీరు అందించేందుకు పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించేందుకు మేజర్ ప్రాజెక్టులన్నీ రీ డిజైన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కోటి ఎకరాలకు సాగునీటిని అందించడం ద్వారా తెలంగాణ పచ్చని పంట పొలాలతో పరవశిస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో ప్రజలు కన్న కలలు నెరవేరాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా మొత్తం 45,300 చెరువులను వచ్చే ఐదేళ్లలో 22,500 కోట్లతో పునరుద్ధరించాలనేది లక్ష్యమన్నారు. 40వేల కోట్లతో 1.26 లక్షల కిలోమీటర్ల పరిధిలో పైప్‌లైన్లువేసి ఇంటింటికి తాగునీరు అందించనున్నట్టు చెప్పారు. మిషన్ భగీరథకు కృష్ణా నుంచి 80 టిఎంసిలు, గోదావరి నుంచి 80 టిఎంసిలు వినియోగిస్తామన్నారు. 66వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చినట్టు చెప్పారు.
ఐటిలో ఉజ్వల భవిష్యత్
ఐటి రంగానికి ఉజ్వల భవిష్యత్ ఉందని గవర్నర్ తెలిపారు. ఐసిటి విధానం ద్వారా హైదరాబాద్‌లో ఐటి రంగానికి మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. కేంద్ర సహకారంతో ఐటిఐఆర్ ప్రాజెక్టు అభివృద్దికి కృషి జరుగుతోందన్నారు. 15 లక్షల మందికి ప్రత్యక్షంగా, 53 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. 70వేల చదరవు అడుగుల్లో టి-హబ్ నిర్మించినట్టు, ఏడాదిలోగా 150 కోట్లతో మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టి-హబ్ విస్తరించనున్నట్టు చెప్పారు. టిఎస్‌ఐపాస్ అమల్లోకి వచ్చిన తరువాత 25వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఫార్మా ఎగుమతుల్లో 20 శాతం తెలంగాణ నుంచే జరుగుతాయని, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఫార్మా సిటీ నిర్మాణం జరుగుతుందన్నారు. హైదరాబాద్- వరంగల్ పారిశ్రామిక కారిడార్, వరంగల్‌లో టెక్స్‌టైల్ హబ్ ద్వారా తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని గవర్నర్ తెలిపారు. 19 నెలల పాలనా కాలంలో ప్రభుత్వం సమర్ధవంతంగా పని చేసిందని, అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించిందని తెలిపారు. లక్షా 15వేల బడ్జెట్ ద్వారా ఎన్నో పథకాలు చేపట్టినట్టు చెప్పారు. విద్యుత్ సామర్ధ్యాన్ని 25వేల మెగావాట్లకు పెంచడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారన్నారు. 2018 నాటికి ఐదువేల మెగావాట్ల సోలార్ విద్యుత్ సామర్థ్యాన్ని సాధించి దేశంలో మొదటిస్థానంలో నిలుస్తామన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన షీ-టీమ్స్‌ను అన్ని జిల్లాలకు విస్తరించనున్నట్టు చెప్పారు. రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. హరితహారం ద్వారా 40 కోట్ల మొక్కలు నాటనున్నట్టు చెప్పారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, పోలీసు వ్యవస్థ ఆధునీకరణకు తీసుకుంటున్న చర్యలను గవర్నర్ వివరించారు.
తొలుత సైనిక కవాతులో గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. సిఎం కె చంద్రశేఖర్‌రావు వీరుల సైనిక స్మారకాన్ని సందర్శించి విజిటర్స్ బుక్‌లో అభిప్రాయం రాశారు. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎంపీలు కార్యక్రమానికి హాజరయ్యారు. గవర్నర్, ముఖ్యమంత్రి పరేడ్‌ను తిలకించారు.
chitram..

గణతంత్ర వేడుకల వేదిక వద్దకు గవర్నర్ నరసింహన్‌ను
సాదరంగా ఆహ్వానిస్తున్న సిఎం కెసిఆర్