తెలంగాణ

నీటికి ఓటు లింకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 25: వచ్చే ఎన్నికల్లోపు ఇంటింటికి సురక్షిత మంచినీరు ఇవ్వకుంటే ఓట్లడిగేది లేదని తానిచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని సిఎం కె చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ప్రజలు కూడా పథకం కోసం ఎదురు చూస్తున్నారని సిఎం పేర్కొన్నారు. ప్రతీ ఇంటికి నల్లా ఏర్పాటు చేసి మంచినీళ్లిచ్చే వాటర్ గ్రిడ్ పథకం పట్ల దేశమంతా ఆసక్తిగా చూస్తోందని, ఈ పథకానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తెరిగి పూర్తి చేయడానికి మరింత వేగం పెంచాలని అధికారులను సిఎం ఆదేశించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో బుధవారం వాటర్ గ్రిడ్ పథకంపై మంత్రులు, ఉన్నతాధికారులతో సిఎం విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. నాణ్యతా ప్రమాణాల్లో ఎక్కడా రాజీ పడకుండా, సాంకేతికంగా భవిష్యత్‌లో పెరగబోయే జనాభాకు అనుగుణంగా పనులు చేపట్టాలని ఆదేశించారు. నీటి పారుదల ప్రాజెక్టులు అంటేనే జాప్యానికి మారుపేరుగా మారాయని, పది పదిహేనేళ్లు సాగదీయడం, భారీ పథకాలంటే ఏళ్ల తరబడి సాగదీయడం అలవాటుగా మారిందంటూ, ఈ విధానం పూర్తిగా మారాలన్నారు. భూ సేకరణ, డిజైన్లు, టెండర్లు, ఆర్థిక అనుమతులు తదితర అంశాలలో ప్రభుత్వం చాలా మార్పులు తీసుకొచ్చిందన్నారు. విధానాల్లో తీసుకొచ్చిన మార్పులను సానుకూలంగా మలుచుకొని పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లావారీగా పనుల పురోగతిని ఆయా జిల్లాల అధికారులు, వర్కింగ్ ఏజెన్సీలతో ముఖ్యమంత్రి సమీక్షించారు. పనులలో స్థానికంగా ఎదురవుతోన్న అవరోధాలకు అప్పటికప్పుడు పరిష్కారం చూపుతూ సిఎం సూచనలు చేశారు. పనుల జాప్యానికి కారణాలను తెలుసుకొని, వేగం పెంచడానికి సిఎం పలు సూచనలు చేశారు. ఇన్‌టెక్ వెల్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణం, పైపులైన్లు తదితర పనులను కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రాజెక్టు నిర్మాణంతోపాటు నిర్వహణ బాధ్యత కూడా అధికారులదే కావడంతో నీటి సరఫరాకు ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైల్వే క్రాసింగ్‌ల వద్ద త్వరితగతిన అనుమతులిచ్చే విషయంలో సానుకూలంగా స్పందించిన అధికారులకు సిఎం కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే, జాతీయ రహదారులు, ఆర్ అండ్ బి, విద్యుత్, నీటిపారుదల తదితర శాఖల అధికారులను కూడా సమావేశానికి ఆహ్వానించి, పరస్పర సహకారంతో ముందుకు పోవాలని ముఖ్యమంత్రి కోరారు.
అవిద్యుత్ అందించండి: జెన్‌కోకు ఆదేశం
వాటర్ గ్రిడ్ పథకానికి అవసరమయ్యే విద్యుత్ సరఫరా చేయడానికి అవసరమైన సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేయాలని జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావును ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. వాటర్ గ్రిడ్ పథకంపై మధ్యాహ్నం జరిగిన సెషన్‌లో విద్యుత్ అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. నిర్ణీత వ్యవధిలో వాటర్ గ్రిడ్ పనులు పూర్తి చేసే కాంట్రాక్టర్లకు 1.5 శాతం ఇనె్సంటివ్ ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. హైదరాబాద్‌కు తాగునీటిని సరఫరా చేసే పైపులైన్లకు అనుసంధానమయ్యే 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 30లోగా మంచినీళ్లు అందించాలని ఆదేశించారు. పైపులైన్లు వేయడానికి అవసరమయ్యే అనుమతులు త్వరగా సాధించడానికి అటవీశాఖ ప్రత్యేకంగా ఒక డిఎఫ్‌ఓను నియమించాలని ఆదేశించారు. రైట్ ఆఫ్ వే చట్టాన్ని అనుసరించి ఆరు అడుగుల లోతున పైపులైన్లను ఎవరి భూముల నుంచైనా వేయవచ్చని సూచించారు. మెదక్ జిల్లాలో వేయబోయే పైపులైను తన వ్యవసాయ భూమి (ఎర్రవెల్లి) నుంచే వెళ్తుందని, చట్టానికి సిఎం మొదలుకొని ఎవరూ అతీతులు కాదని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.
chitram...
వాటర్ గ్రిడ్‌పై విస్తృతస్థాయ సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్