తెలంగాణ

ఆలయాల నిర్మాణానికి భారీగా నిధుల పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: బలహీన వర్గాలు, ఎస్‌సి, ఎస్‌టి కాలనీల్లో ఆలయాల నిర్మాణానికి నిధుల కేటాయింపును భారీగా పెంచారు. ప్ర స్తుతం చెల్లిస్తున్న రూ. 3 లక్షల మొ త్తాన్ని ఇప్పుడు రూ. 10 లక్షలకు పెం చుతూ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా కామన్ గుడ్ ఫండ్‌కు వంద కోట్ల రూపాయలు కేటాయించాలని నిర్ణయించారు. పనిలోపనిగా చారిత్రాత్మక, పురాతన ఆలయాల అభివృద్ధిపై దృష్టి సారించనున్నారు. కామన్‌గుడ్ ఫండ్‌పై దేవాదాయశాఖ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించింది. సెక్రటేరియట్‌లో జరిగిన ఈ సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఆలయాల నిర్మాణానికి ఇస్తున్న మూడు లక్షల రూపాయల వల్ల కనీసం బెస్‌మెంట్ నిర్మాణానికి కూడా సరిపోవడం లేదని, దీనిని పది లక్షల వరకు పెంచాలని నిర్ణయించారు. కామన్ గుడ్ ఫండ్‌లో నిధుల కొరత ఉన్నందున అదనపు నిధులు మంజూరు చేసే విధంగా ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించారు. సిజిఎఫ్‌కు వంద కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. నిధుల కేటాయింపు పెరిగితే నూతన ఆలయాల నిర్మాణంతో పాటు, ధూపదీప నైవేధ్యం కింద కొత్త ఆలయాలను చేర్చడానికి అవకాశం ఉంటుందని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. యాదాద్రి, వేములవాడ పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేసేందుకు భారీ ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు.

కామన్‌గుడ్ ఫండ్‌పై తెలంగాణ సెక్రటేరియట్‌లో శనివారం జరిగిన
దేవాదాయశాఖ సమీక్షా సమావేశంలో పాల్గొన్నమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ఓయులో టెన్షన్ టెన్షన్

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం ౄ అడ్డుకున్న మరో విద్యార్థి సంఘం .. విద్యార్థుల అరెస్ట్

నాచారం, ఫిబ్రవరి 13: సెంట్రల్ యూనివర్సిటీలో దళిత విద్యార్థి మృతికి కారణమైన కేంద్ర మంత్రిని వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ ఓయులో ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అయితే ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడాన్ని నిరసిస్తూ ఓయులోని ఆర్ట్స్ కాలేజీ ఆవరణ నుంచి ఏబివిపి విద్యార్థి సంఘం నాయకులు భారీ ర్యాలీ నిర్వహించగా, ఇరు విద్యార్థి సంఘాల మధ్యన ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువిద్యార్థి సంఘాల నాయకులను ఓయు పోలీసులు అడ్డుకుని 20మంది విద్యార్థి నాయకులను అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండగా దళితులపై హింస చెలరేగుతోందని అవేదన వ్యక్తం చేశారు. మతోన్మాద శక్తులకు మంత్రి దాసోహం పలుకుతున్నారని, దళిత విద్యార్థి మృతికి కారణమైన నాయకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్ధి సంఘాల మధ్యన ఘర్షణ
ఓయులో బిజెపి ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుండగా ఏఐఎస్‌ఎఫ్, ఏబివిపి విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆర్ట్స్‌కాలేజీ ఆవరణలో ఇరు విద్యార్థి సంఘాల నాయకులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడగా, ఓయు పోలీసులు అడ్డుకుని విద్యార్థి నాయకులను అరెస్టు చేశారు.
ఓయులో తెలంగాణ
ఉద్యమ చరిత్ర పుస్తకం దగ్ధం
నాచారం, ఫిబ్రవరి 13: తెలంగాణ ఉద్యమంలో ఓయుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని అలాంటి ఉద్యమాన్ని రచయిత ప్రకాష్ కించపరిచారని విద్యార్థులు మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర అనే పుస్తకాన్ని ఓయు ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో దగ్ధం చేశారు.
అనంతరం మట్లాడుతూ విద్యార్థి బలిదానాలను రచయిత ప్రకాష్ కేవలం ఒక్క పేజీలో మాత్రమే పొందుపరిచి కేసిఆర్ కుటుంబాన్ని కీర్తించారని మండిపడ్డారు. విద్యార్థి ఉద్యమాలను కించపరిచే తెలంగాణ చరిత్ర పుస్తకాలను ఎవరు రాసినా సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.