తెలంగాణ

ఇవిఎంల టాంపరింగ్‌పై న్యాయ పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఇవిఎం)ను తెలంగాణ రాష్ట్ర సమితి టాంపరింగ్ చేయడంపై తాము న్యాయ పోరాటం చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. ఇవిఎంల టాంపరింగ్‌పై తాము పోలింగ్ జరిగిన రోజే రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని శశిధర్ రెడ్డి శనివారం పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్, సీనియర్ అడ్వకేట్ జంధ్యాల రవిశంకర్‌తో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ విమర్శించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరపరాదని తాము కోరామని శశిధర్‌రెడ్డి చెప్పారు. సోమాజిగూడలో ఇండిపెండెంట్ అభ్యర్థి రాధిక తన ఓటు హక్కు వినియోగించుకోగా ఓటు రికార్డు కాలేదని ఆయన తెలిపారు. అడ్డగుట్టలో 556 ఓట్లు ఉండగా, అందులో టిఆర్‌ఎస్‌కు 232 పోలయ్యాయని ఆయన చెప్పారు. ఇటువంటి విషయాలన్నీ తాము ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్ళగా, ఒక్కోసారి కాలిక్యులేటర్ కూడా లెక్క తప్పు చూపిస్తుందని చెప్పడం బాధాకరమని అన్నారు. ఇవిఎంల టాంపరింగ్‌కు అవకాశం ఉందని 2010 సంవత్సరంలో కెసిఆరే అన్నారని శశిధర్ రెడ్డి గుర్తు చేశారు. కాబట్టే కెసిఆర్ తనయుడు రాష్ట్ర మంత్రి కెటిఆర్ ముందు నుంచే టిఆర్‌ఎస్‌కు వంద సీట్లు వస్తాయని చెప్పారని ఆయన తెలిపారు. బ్యాలెట్‌లో ‘నోటా’ లేకపోవడాన్ని కూడా తాము ఎన్నికల అధికారి దృష్టికి తీసుకుని రాగా దీనిపై తాను రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాధానమిచ్చారని ఆయన చెప్పారు.