తెలంగాణ

2 లక్షల ఇళ్లకు రూ.14 వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి ఈ సంవత్సరం బడ్జెట్‌లో 14,664 కోట్ల రూపాయలు కేటాయించాలని గృహ నిర్మాణ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఘన విజయం సాధించగానే ప్రజలకు కృతజ్ఞతలు చెబుతూ గ్రేటర్ పరిధిలో ఏడాదిలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. గ్రేటర్‌లో లక్ష ఇళ్ల నిర్మాణానికి 7750 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. గ్రేటర్‌లో ఒక్కో ఇంటి నిర్మాణానికి ఏడున్నర లక్షలు కేటాయిస్తున్నారు. అదే విధంగా ఇక తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లో ఏడాది కాలంలో మరో లక్ష ఇళ్లను నిర్మించనున్నట్టు ముందుగానే ప్రకటించారు. ఈ లక్ష ఇళ్ల నిర్మాణానికి 6,194 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని తేల్చారు. గ్రేటర్‌లో, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో రెండు లక్షల ఇళ్ల నిర్మాణానికి మొత్తం 14వేల 664 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. ఈ మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రతిపాదనలు రూపొందించారు. గృహ నిర్మాణ శాఖకు కేటాయింపులపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఉన్నతాధికారులతో మంగళవారం చర్చించారు. హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు నిర్మిస్తారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 60వేల ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో 40వేల ఇళ్లు నిర్మిస్తారు. వీటికి 6,194 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. సబ్సిడీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఐఎవై పథకం కింద నిర్మించే 55వేల ఇళ్లకు 527కోట్ల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో పిఎంఎవై పథకం కింద నిర్మించే 18,672 ఇళ్లకు 193కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు ఏటా 25వేల రూపాయల చొప్పున కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖరీఫ్, రబీ నాటికి నీళ్లు ఇవ్వగలిగే ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యత ఇస్తారు. నీటి పారుదల ప్రాజెక్టుల తరువాత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకానికే ఎక్కువ నిధులు కేటాయించనున్నారు. ఆసరాతో పాటు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పథకం ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూల వైఖరి కలిగేట్టు చేసిందని భావిస్తున్న ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రిష్టాత్మకంగా చేపట్టింది.
అదే విధంగా దేవాదాయ శాఖ కేటాయింపులపై సైతం ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులతో చర్చించారు. దేవాదాయ శాఖ ఉద్యోగుల జీతభత్యాలకు 22 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరుతూ ప్రభుత్వానికి అందజేయడానికి బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించారు.