అంతర్జాతీయం

చైనాతో భారత్ సరిహద్దు చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్ రానున్న అజిత్ దోవల్
బీజింగ్, డిసెంబర్ 31: దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సరిహద్దు సమస్యతోపాటు అన్ని ద్వైపాక్షిక అంశాలను చైనాతో చర్చించి వాటినో కొలిక్కి తీసుకొచ్చే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇదే లక్ష్యంతో చైనా పర్యటనను చేపట్టనున్నారు. ఇప్పటికే చైనా, భారత్ సరిహద్దు చర్చలు ప్రక్రియలో ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తున్న దోవల్ చైనా జాతీయ భద్రతా సలహాదారు యాంగ్ జీచీతో జనవరి 5న విస్తృత చర్చలు జరుపుతారు. ఈ విషయాన్ని చైనా అధికారులు గురువారం నాడిక్కడ వెల్లడించారు. చైనా ప్రధాని లీ కెకియాంగ్‌తో జనవరి 6న దోవల్ సమావేశం అవుతారని ఈ వర్గాలు తెలిపాయి. దాదాపు 3,488 కిలోమీటర్ల మేర విస్తరించిన సరిహద్దుపై వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇరుదేశాల మధ్య ఇప్పటివరకూ 18సార్లు చర్చలు జరిగాయి. అయినా ఈ సమస్య ఓ కొలిక్కిరాకపోవడంతో ప్రత్యేక ప్రతినిధిని నియమించుకున్నాయి. దక్షిణాసియా ప్రాంతంలోని అన్ని దేశాలతో సన్నిహిత సంబంధాలు పెంపొందించుకోవాలని చైనా భావిస్తున్న తరుణంలో దోవల్ పర్యటన జరగడం గమనార్హం. ముఖ్యంగా దక్షిణాసియా దేశాలు అన్నింటితోనూ మోదీ సారధ్యంలోని ఎన్‌డిఏ సర్కార్ ద్వైపాక్షి సంబంధాలు పెంపొందించుకునే చర్యలు చేపట్టిన తరుణంలోనే చైనాకూడా అందుకు ముందుకురావడం దౌత్యవర్గాల్లో ఆందోళనకు కారణమవుతోంది.