నల్గొండ

టిఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమ్మినేని వీరభద్రం
నల్లగొండ, డిసెంబర్ 8 : రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించేందుకు అన్ని వర్గాల ప్రజలను చైతన్యం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పార్టీ నాయకత్వానికి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో సంఘ్‌పరివార్ మత ఘర్షణలు సృష్టించే విధంగా ప్రకటనలు చేస్తున్నారని, పాలన పగ్గాలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడంలేదని, ఖమ్మంలో సిపిఐ అభ్యర్ధికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని, మిగిలిన జిల్లాలో సిపిఎం ఎంపిటిసిలు, జడ్పీటిసిలు, కౌన్సిలర్లు ఓటింగ్‌లో పాల్గొనబోరని తెలిపారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తుందని, పశు సంపద తగ్గిపోయి, పశువులు కళేబరాలకు తరలుతున్నాయన్నారు. జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతన్నలను ఆదుకోవాలన్నారు. తక్షణ సాయంగా 1000కోట్లు నిధులు విడుదల చేయాలన్నారు. లేకుంటే ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి, సలీం ఉన్నారు.