రాష్ట్రీయం

ఎన్నికలు బహిష్కరించిన గిరిజన తండాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుటాహుటిన తరలివచ్చిన కలెక్టర్ కరుణ
కలెక్టర్ హామీతో ఓట్లేసిన గిరిజనులు

తొర్రూరు, నవంబర్ 21: ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చే నాయకులు ఎన్నికల అనంతరం తమ తండాల్లోని సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రభుత్వం కూడా వౌలిక వసతులు కల్పించడం లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపిస్తూ తమ సమస్యలను ప్రపం చం దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో శనివారం జరిగిన వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికలను బహిష్కరించినట్లు తొర్రూరు మండలం వెలికట్ట గ్రామశివారు టీక్య తండా, అమ్మాపురం గ్రామశివారు జీకే తండాకు చెం దిన గిరిజనులు ప్రకటించారు. శనివారం జరిగిన వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నికల అధికారులు మండలంలోని రెండు తండాలకు చెం దిన గిరిజనులు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్క సారిగా కంగుతిన్నారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా తమ తండాల సమస్యలను పట్టించుకోవడం లేదని అందుకు నిరసనగా తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నామంటూ పేర్కొంటూ గిరిజనులు ప్రత్యేకంగా ముద్రించిన ప్లెక్సీని తం డాల మొదట్లో ఏర్పాటు చేసి ఎన్నికలను బహిష్కరించారు. దీంతో ఆందోళన చెందిన అధికారులు గిరిజన తం డాలు ఎన్నికలను బహిష్కరించిన విషయాన్ని వెంటనే జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ దృష్టికి తీసుకెల్లారు. దీంతో కలెక్టర్ హుటాహుటిన తొర్రూ రు మండలం వెలికట్ట శివారు టీక్యా తండా, అమ్మాపురం శివారు జీకే తండాలను సందర్శించి ఆయా తం డాల గిరిజనులు, గిరిజన పెద్దలతో చర్చించారు. ఎన్నికలను బహిష్కరించడం సరైన పద్ధతి కాదని ఎన్నికల అనంతరం తండాల సమస్యలను తానే స్వయంగా పరిశీలించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తన మాటపై నమ్మకం ఉంచి గిరిజనులు పోలింగ్‌లో పాల్గొనాలని కలెక్టర్ గిరిజనులను కోరారు. ఎన్నికల అనంతరం తమ సమస్యలను పరిష్కరిస్తామని స్వయంగా జిల్లా కలెక్టర్ కరుణ హామీ ఇవ్వండంతో శాంతించిన గిరిజనులు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత పోలింగ్‌కు హాజరై ఓట్లేసారు.
తొర్రూరులో పోలింగ్ ప్రశాంతం
వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికకు శనివారం జరిగిన పోలింగ్ తొర్రూరు మండలంలో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా 9 గంటల తర్వాతనే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా పలు పోలింగ్ కేంద్రాల ఎదుట ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు గుంపులుగా నిలబడి ఓటర్లను ఆకర్శించే ప్రయత్నాలు చేశారు.
కాగా పలు రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు మండల కేంద్రంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల అధికారులను పోలింగ్ శాతం, ఓటింగ్ సరళి గురించి అడిగి తెలుసుకున్నారు. మం డలంలో ఓట్ల సందర్బంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండ తొర్రూరు సిఐ శ్రీధర్‌రావు, ఎస్‌ఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బలగాలు ముమ్మరం గా బందోబస్తు చేపట్టాయి. కాగా తొర్రూరు మండలంలో 68 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.