ఈ వారం తార

గరంగరంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘స్టార్’కేస్ త్వరగా ఎక్కేసే ఉద్దేశంతో
-ఏజ్‌కు మించిన ఎక్స్‌పోజింగ్‌కు ఎలాంటి హద్దులూ లేవంటోంది కానె్వంట్ పిల్ల. అరంగేట్రం నుంచే ఆ తరహా పాత్రలకి వాడుకోవచ్చనే సందేశాన్ని ఇండస్ట్రీకి బలంగానే ఇచ్చింది. ఆమె ఎవరో కాదు -శ్రీయా శర్మ. చాలాకాలం క్రితం ‘జై చిరంజీవ’లో మెగాస్టార్ మేనకోడలిగా కనిపించిన పసికూనే.. దూకుడులో సమంతకు ఈడొచ్చిన చెల్లిగానూ మెప్పించింది. అయితే, ఇంత త్వరగా హీరోయిన్ అవతారం ఎత్తుతుందని ఇండస్ట్రీ సైతం ఊహించలేదు. అంచనాలను తలకిందులు చేస్తూ ‘నిర్మలా కానె్వంట్’లో కను‘విందు’ చేసింది శ్రీయా శర్మ. పాలబుగ్గలతో కనిపిస్తున్నా, కవ్వించే క్యారెక్టర్లు చేయడంలో నేర్పు నేర్చుకునే వచ్చిందని పలువురు సెలబ్రిటీలే చెబుతుండటం గొప్ప విషయమే. శ్రీయా ఎక్స్‌పోజింగ్ వీరవిహారం చూసి, కమర్షియల్ హీరోయిన్‌కు కిలోమీటర్ దూరంలో కూడా లేదని టాలీవుడ్ టాకేసుకుంటోంది. ఔరా.. శ్రీయా!