జాతీయ వార్తలు

తస్మాత్.. జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోదీ, పార్లమెంట్,
అణు కేంద్రాలపై దాడికి లష్కరే కుట్ర
ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరిక
దేశంలోకి 20 మంది ఉగ్రవాదులు
హైదరాబాద్ సహా అన్ని నగరాలు మరింత అప్రమత్తం
న్యూఢిల్లీ, డిసెంబర్ 29:ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పార్లమెంట్ భవనం, దేశంలోని అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడులకు ఒడిగట్టేందుకు పాక్ తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబా ప్రయత్నించే అవకాశం ఉందంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. హైదరాబాద్, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు సహా అన్ని ప్రధాన నగరాల్లోనూ పోలీసు బలగాలు మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశాయి. కొత్త సంవత్సరం, అలాగే రానున్న పండుగల వాతావరణాన్ని ఆసరా చేసుకుని విఘాతక కృత్యాలకు పాల్పడేందుకు లష్కరే మిలిటెంట్లు కుట్ర పన్నినట్టు సమాచారం అందినట్టు వెల్లడించాయి. దీని దృష్ట్యా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా ఎలాంటి ఏపరపాటుకు ఆస్కారం ఇవ్వకూడదంటూ హెచ్చరికలు జారీ చేశాయి. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, పార్లమెంట్ భవనమే లష్కరే మిలిటెంట్ల లక్ష్యంగా కనిపిస్తోందంటూ నిఘా వర్గాల్ని ఉటంకిస్తూ మీడియా కధనాలు వెలువడ్డాయి. దేశంలో అత్యంత కీలకమైన అణు కేంద్రాలు, సైనిక ప్రధాన కార్యాలయాలనూ లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు విరుచుకు పడే అవకాశం ఉందని తెలిపాయి. దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా భయానక రీతిలో దాడులకు పాల్పడేందుకు ఇప్పటికే దాదాపు 20మంది ఉగ్రవాదులు సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించినట్టుగా కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. కొత్త ఏడాది ఉత్సవాల సందర్భంగా భద్రతాపరంగా విస్తృత చర్యలు చేపట్టాలని, నిఘా వ్యవస్థలను నిరంతరం అప్రమత్తంగా ఉంచాలంటూ అన్ని రాష్ట్రాలనూ కేంద్రం ఇప్పటికే హెచ్చరించింది. మరో పక్క కీలక కేంద్రాలు, స్థావరాల భద్రతకు అదనంగా దళాలను మోహరించాల్సిన అవసరం ఎంతో ఉందని కూడా నిఘా వర్గాలు ఆన్ని రాష్ట్రాలనూ కోరాయి. రైల్వే స్టేషన్లు, మార్కెట్ ప్రదేశాలు, బస్ టెర్మినళ్లు, ప్రార్థనా స్థలాలు ఇలా అన్ని కీలక ప్రాంతాల్లోనూ అదనపు బలగాలను మోహరించి ఉగ్రవాద దాడులను నిర్వీర్యం చేయాలని సూచించాయి.