జాతీయ వార్తలు

దేశీయ కంపెనీలకు కార్పొరేట్ పన్నులు తగ్గింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశీయ కంపెనీల కార్పొరేట్ పన్నులు తగ్గించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నది. దేశీయ కంపెనీలు, నూతన తయారీ రంగ సంస్థలకు కార్పొరేట్ పన్నులు తగ్గించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆమె గోవాలోని పనాజీలో మీడింయా సమావేశంలో మాట్లాడుతూ ఈ నిర్ణయంతో దేశీయ కంపెనీలు 22శాతం పన్నులు చెల్లించేందుకు అవకాశం కలుగుతుందని ఆమె తెలిపారు. ఉత్పత్తిరంగంలోకి పెట్టుబడులను ఆహ్వానించటమే తమ లక్ష్యమని ఆర్థికమంత్రి వెల్లడించారు. ఇదిలావుండగా మేకిన్ ఇండియాకు ఊతమిచ్చేలా 2019-20 ఆర్ధిక సంవత్సరం నుంచి ఆదాయ పన్ను చట్టానికి మరో సవరణ జరగనుంది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త తయారీ రంగ సంస్థలు కూడా 15 శాతం పన్ను చెల్లించేలా అవకాశం దొరకుతుంది. అయితే కొత్త పన్ను చట్టం కింద కంపెనీలకు మినహాయింపులు, ప్రోత్సహకాలు ఉండవు అని ఆర్థికమంత్రి పేర్కొన్నారు.