అంతర్జాతీయం

తజికిస్థాన్‌లో తీవ్ర భూకంపం .. భారత్‌లోనూ ప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుశాంబె/ న్యూఢిల్లీ, డిసెంబర్ 7:తజికిస్థాన్‌లో సోమవారం మధ్యాహ్నం తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో సంభవించిన ఈ భూకంప ప్రకంపనల ప్రభావం భారత్, పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాలపై కూడా పడింది. ఢిల్లీ, కాశ్మీర్, పంజాబ్‌లోని అనేక ప్రాంతాలు భూకంప ప్రభావానికి లోనయ్యాయి. దానితో ప్రజలు భయంతో బయటికి పరుగులు పెట్టారు. కాగా తజికిస్థాన్‌లోని మారుమూల పట్టణమైన ముర్గోబ్ పట్టణానికి పశ్చిమంగా 109కిలోమీటర్ల దూరంలో..28కిలోమీటర్ల భూమి లోతులో ఈ భూకంపం మూల కేంద్రం ఉన్నట్టు అమెరికా నిపుణులు వెల్లడించారు. కాగా, ఈ భూకంపం అత్యంత తీవ్రమైనదే అయినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని తజికిస్థాన్ ప్రభుత్వం తెలిపింది.