ఆంధ్రప్రదేశ్‌

జన్మభూమి రసాభాస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికారుల నిలదీత..ఉత్తరాంధ్రలో ఉద్రిక్తతలు
తహశీల్దార్‌ను నిర్బంధించిన టిడిపి నాయకులు

విశాఖపట్నం/శ్రీకాకుళం/విజయనగరం, జనవరి 2: ఉత్తరాంధ్రలో శనివారం ప్రారంభమైన మూడో విడత జన్మభూమి కార్యక్రమంలో పలు సమస్యలపై అధికారులను స్థానికులు నిలదీశారు. కొన్నిచోట్ల ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలే తహశీల్దార్ సహా రెవెన్యూ సిబ్బందిని నిర్బంధించి గందరగోళం సృష్టించారు. విశాఖ జిల్లా రావికమతం మండలం కన్నంపేట జన్మభూమి గ్రామసభలో జరిగిన ఘర్షణకు సంబంధించి అధికారుల ఫిర్యాదు మేరకు 11 మంది వైకాపా వర్గీయులపై కేసులు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాకవరపాలెం మండలంలో జరిగిన గ్రామసభల్లో అధికార పార్టీ వారికి మినహా, ఇతరులకు పింఛన్లు అందటం లేదంటూ అధికారులను గ్రామస్థులు నిలదీశారు. కొయ్యూరు మండలం ఆడాకుల్లో జరిగిన కార్యక్రమంలో గత రెండు విడతల్లో జరిగిన కార్యక్రమాల్లో ఇచ్చిన ఫిర్యాదులు పరిష్కారం కాలేదంటూ స్థానిక సర్పంచ్ గంగయ్యమ్మ, ఎంపిటిసి రామయ్యమ్మ సభావేదిక కిందనే కూర్చొని నిరసన తెలిపారు. గూడెంకొత్తవీధి మండలంలో జరిగిన కార్యక్రమాల్లో బాక్సైట్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జన్మభూమి కార్యక్రమాన్ని వైకాపా నాయకులు, స్థానికులు బహిష్కరించారు. చోడవరం మండలం గంధవరం గ్రామంలో సర్పంచ్ పల్లా నర్సింగరావు, మాజీ సర్పంచ్ పల్లా అర్జున అభివృద్ధి పనుల విషయంలో తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. చివరికి అధికారుల జోక్యంతో పరిస్థితి సద్దు మణిగింది. కోటవురట్ల మండలం పందూరు గ్రామసభలో సర్పంచ్‌కు టిడిపి నాయకులకు పింఛన్ల మంజూరుపై వాగ్వివాదం జరిగింది.
మూడో విడత జన్మభూమి కార్యక్రమం తొలిరోజు శనివారం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం ఎల్.ఎన్.పేట తహశీల్దార్‌తోపాటు రెవెన్యూ సిబ్బంది జన్మభూమి సభలకు పయనమయ్యే సమయంలో అక్కడకు చేరుకున్న తెలుగుదేశం పార్టీకి చెందిన జెడ్పీటిసీ సభ్యురాలు వెలమల సుగుణ, ఆమె భర్త, యంబరాం సర్పంచ్ గోవిందరావు, కొంతమంది కార్యకర్తలు వచ్చి కార్యాలయానికి తాళాలు వేసి నిర్భంధించారు. మండలంలో 1077 మంది రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోగా, 526 మందికే కార్డులు మంజూరు చేయడంపై వీరు నిరసనకు దిగి రభస సృష్టించారు. దీంతో రెవెన్యూ అధికారులు సుమారు రెండు గంటలపాటు నిరీక్షించాల్సివచ్చింది. చివరికి శ్రీకాకుళం ఎంపి దృష్టికి విషయం తీసుకువెళ్ళగా, ఆయన ఫోన్‌లో గోవిందరావును బుజ్జగించడంతో పరిస్థితి సద్దుమణిగింది. కంచలి మండలం కత్తివరం పంచాయతీ సర్పంచ్ దీర్ఘాశి ధర్మారావు జన్మభూమి అధికారులను గ్రామ సభలో రేషన్‌కార్డుల ఎంపికపై నిలదీసారు. సర్పంచ్ వైకాపా నేత కావడంతో అధికారపార్టీ నేతలు జన్మభూమి కమిటీ ప్రతినిధులు వాగ్వివాదానికి దిగడంతో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. విషయం తెసుకున్న ఎస్సై వేణుగోపాల్ అక్కడకు చేరుకోని పరిస్థితిని అదుపుచేసారు. అలాగే మకరాంపురం సర్పంచ్ వజ్జ పుష్పలత సంబంధిత అధికారులను జన్మభూమి సభలో రేషన్‌కార్డుల ఎంపికలో అధికార పార్టీ సిఫార్సులకు తలొగ్గితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించడంతో పసుపుదళం తిరగబడింది. ఆమదాలవలస నియోజకవర్గంలో పొందూరు మండలం పరిధిలో లోలుగు, కంచరాం, తానాం గ్రామాల్లో మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డుల్లో తప్పులు దొర్లడంతో అధికారులపై ప్రజలు తిరుగుబాటు చేసారు. పాలకొండ మండలం సింగన్నవలస గ్రామంలో జన్మభూమి గ్రామ కమిటీలపై ఇరువర్గాల మధ్య వాగ్వాదం చివరికి తోపులాటకు దారితీసింది.
బొబ్బిలి రూరల్ మండల పరిధిలోని పిరిడి, కొండదేవుపల్లి, నారాయణప్పవలస, కాశిందొరవలస గ్రామాల్లో జన్మభూమి అరుపులు, కేకలతో ప్రారంభమైంది. ఈ మేరకు పిరిడి గ్రామంలో జన్మభూమి కమిటి సభ్యులను సమావేశాలకు పిలవకపోవడంతో అధికారులను నిలదీశారు. మక్కువ మండలం పనసభద్ర పంచాయతీలో సమస్యలు పరిష్కరించటం లేదంటూ జన్మభూమి కార్యక్రమాన్ని గిరిజనులు మూకుమ్మడిగా బహిష్కరించారు. కొమరాడ మండలంలోని పలు గ్రామాల్లో అధికారులను స్థానికులు నిలదీసి చెమటలు పట్టించారు.