జాతీయ వార్తలు

హైదరాబాద్‌లో ప్రాంతీయ ఉపాధ్యాయ శిక్షణా సంస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రానికి ఎంపీ వినోద్ కుమార్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ, డిసెంబర్ 21: హైదరాబాద్‌లో ప్రాంతీయ ఉపాధ్యాయ శిక్షణా సంస్థను ఏర్పాటు చేయాలని తెరాస సీనియర్ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు బి.వినోద్ కుమార్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. దేశంలో ప్రస్తుతం 5,86,000 ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులు, 3,50,000 ప్రాథమికోన్నత స్థాయి టీచర్ల కొరత ఉందని, ఈ కొరతను తీర్చేందుకు అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ విద్యా సంస్థలను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని వినోద్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు. ఉపాధ్యయ శిక్షణా విధానంలో లోపం వల్లనే ఈ పరిస్థితులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఉపాధ్యాయ శిక్షణా విధానం లోపభూయిష్టంగా ఉండటంతో ఎంతో మంది ఉపాధ్యాయులు కనీసం ప్రాథమిక స్థాయిని కూడా చేరుకోలేకపోతున్నారని, కేవలం 15 శాతం మంది ఉపాధ్యాయులు మాత్రమే అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులు కాగలుగుతున్నారంటే పరిస్థతి ఎంత విషమంగా ఉందో తెలుస్తోందని వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.