క్రీడాభూమి

యువీ, నెహ్రాలకు స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* భారత టి-20 జట్టులో పాతకాపులు
* వనే్డల్లో అశ్విన్ రైనాకు దక్కనిచోటు
* ధోనీకే కెప్టెన్సీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: ఆస్ట్రేలియా పర్యటనలో టి-20, వనే్డ ఇంటర్నేషనల్ సిరీస్‌లు ఆడనున్న భారత జట్లను సందీప్ పాటిల్ నాయకత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ శనివారం ఎంపిక చేసింది. 15 మందితో కూడిన టి-20 జట్టులో పాతకాపులు యువరాజ్ సింగ్, ఆశిష్ నెహ్రాలకు స్థానం లభించడం విశేషం. సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను కూడా టి-20 జట్టులోకి తీసుకోవడం ద్వారా సెలక్టర్లు ఎలాంటి సంకేతాలు పంపాలని అనుకున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. వచ్చే ఏడాది స్వదేశంలో ప్రపంచ కప్ టి-20 చాంపియన్‌షిప్ జరగనున్న కీలక సమయంలో ఏరికోరి పాతకాపులను తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. అదే విధంగా వనే్డ జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకోవడం కూడా ఎవరూ ఊహించని పరిణామమే. ముందుగా ఊహించిన విధంగానే ఈ రెండు జట్లకు కెప్టెన్‌గా కొనసాగే బాధ్యతను మహేంద్ర సింగ్ ధోనీకే అప్పచెప్పినప్పటికీ, సురేష్ రైనాను సెలక్టర్లు వనే్డ జట్టుకు ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. వనే్డల్లో బ్రయింద్ స్రాన్, టి-20 ఫార్మెట్‌లో హార్దిక్ పాండ్య ఎంపిక కూడా అసాధారణంగానే కనిపిస్తున్నది. మోకాలి గాయానికి శస్త్ర చికిత్స చేయించుకొని కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఫిట్నెస్ పట్ల సెలక్టర్లు సానుకూల ధోరణితో వ్యవహరించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) రెండేళ్లు సస్పెన్షన్‌కు గురైన రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన ఆటగాళ్లకు జరిగిన డ్రాఫ్ట్‌లో ధోనీతో పోటీపడుతూ అత్యధిక పారితోషికాన్ని సంపాదించిన రైనాను సెలక్టర్లు వనే్డ జట్టుకు ఎంపిక చేయకుండా విస్మరించడం విచిత్రం. రాజస్థాన్, చెన్నై స్థానాల్లో కొత్తగా అడుగుపెట్టిన ఫ్రాంచైజీలు రాజ్‌కోట్, పుణె జట్ల కోసం డ్రాఫ్ట్ జరిగింది. మొదట ఆటగాడిని ఎంపిక చేసే అవకాశం పుణెకు లభించడంతో ఆ ఫ్రాంచైజీ ధోనీని 12.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అనంతరం రాజ్‌కోట్ వంతు వచ్చింది. స్థానికుడు, ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రతిభ కనబరచిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజానే రాజ్‌కోట్ 12.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, ఎవరూ ఊహించని రీతిలో ఆ ఫ్రాంచైజీ రైనా పట్ల మొగ్గు చూపింది. ఐపిఎల్ డ్రాఫ్ట్‌లో ధోనీతో సమానంగా నిలిచిన రైనాను సెలక్టర్లు కేవలం టి-20 ఫార్మెట్‌కే ఎందుకు పరిమితం చేశారన్న ప్రశ్నకు సమాధానం లేదు. (చిత్రం) ఆసీస్‌తో జరిగే వనే్డ, టి-20 సిరీస్‌ల్లో పాల్గొనే భారత జట్లకు నాయకత్వం వహించనున్న ధోనీ.

కలిసొచ్చిన సిరీస్
భారత స్టార్ స్పిన్నర్ ఆసీస్‌తో జరిగే వనే్డ, టి-20 సిరీస్‌ల్లో పాల్గొనే భారత జట్లకు నాయకత్వం వహించనున్న ధోనీ.రవిచంద్రన్‌కు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ కలిసొచ్చింది. టెస్టు సిరీస్‌లో 31 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న అతను అంతకు ముందు జరిగిన వనే్డ సిరీస్‌లో చక్కటి ప్రతిభ కనబరిచాడు. భారత్ ఓటమిపాలైనప్పటికీ, అశ్విన్ ఒక్కడే తన అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. తనను మించిన స్పిన్నర్ ప్రస్తుతం భారత్‌లో లేడని నిరూపించుకున్నాడు. ఆ సిరీస్ కారణంగానే అతనికి మళ్లీ పరిమిత ఓవర్ల జట్టులో స్థానం దక్కింది.

ఆసీస్ టూర్‌కు భారత జట్లు
వనే్డ: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఆజింక్య రహానే, మనీష్ పాండే, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, అక్షర్ పటేల్, ఇశాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, గుర్‌కీరత్ సింగ్ మాన్, రిషీ ధావన్, బ్రయిందర్ స్రాన్.
టి-20: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఆజింక్య రహానే, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, అశ్విన్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, హర్భజన్ సింగ్, ఉమేష్ యాదవ్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, ఆశిష్ నెహ్రా.

ఊహించని నిర్ణయం!
న్యూఢిల్లీ, డిసెంబర్ 19: ఆశిష్ నెహ్రాకు జాతీయ జట్టులో స్థానం లభిస్తుందని ఎవరూ ఊహించలేదు. యువ ఆటగాళ్లకు ప్రాధాన్యతనిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న సమయంలో 36 ఏళ్ల నెహ్రాను టి-20 జట్టుకు ఎంపిక చేయడం విచిత్రం. ఆస్ట్రేలియా పిచ్‌లు ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలిస్తాయి కాబట్టి, అనుభవజ్ఞుడైన పేసర్ అవసరమని సెలక్టర్లు భావించి ఉండవచ్చు. కారణాలు ఏవైనా నెహ్రా ఎంపిక అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. తన కెరీర్ ముగిసినట్టే అనుకుంటున్నానని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానిం చిన నెహ్రాను కూడా ఈ అనూహ్య నిర్ణయం ఆశ్చర్యపరచి ఉండొచ్చు.

ఫామ్‌లో ఉన్నందుకే..
న్యూఢిల్లీ, డిసెంబర్ 19: ఇప్పుడు జరుగుతున్న విజయ్ హజారే పరిమిత ఓవర్ల టోర్నీలో యువరాజ్ సింగ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకోవడమే అతని ఎంపికకు కారణమైంది. మంచి ఫామ్‌లో ఉన్న అతనిని జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లు నిర్ణయించారు. 2011 వరల్డ్ కప్‌లో అద్వితీయ ప్రతిభ కనబరచి, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును స్వీకరించిన యువీ ఆతర్వాత క్యాన్సర్ బారిన పడడంతో క్రికెట్‌కు దూరమయ్యాడు. అమెరికాలో చికిత్స అనంతరం మృత్యుంజయుడిగా తిరిగి వచ్చిన తర్వాత అతనికి జాతీయ జట్టులో మళ్లీ స్థానం లభించినప్పటికీ, ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అయితే, దేశవాళీ పోటీల్లో గొప్పగా ఆడడం ద్వారా మరోసారి టీమిండియాకు ఎంపికయ్యాడు.