రాష్ట్రీయం

తెలంగాణ స్కూళ్లకు కొత్త శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంపౌండ్ వాల్స్, మరుగుదొడ్లు , రక్షిత తాగునీటి సరఫరా, కొత్త రంగులు రూ. 600 కోట్లు సమీకరణ

హైదరాబాద్, నవంబర్ 24: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలకు కొత్త శోభకు రంగం సిద్ధం అయింది. ఒక పక్క సిబ్బంది కొరతను తీరుస్తూ కొత్తవారిని నియమించడంతో పాటు విద్యాసంస్థల రూపురేఖలను మార్చడానికి చర్యలు మొదలయ్యాయి. వివిధ పద్దుల కింద ఉన్న దాదాపు 600 కోట్ల రూపాయలను సమీకరించి స్కూళ్ల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా కొత్త భవనాల నిర్మాణం, పాత భవనాల పునరుద్ధరణ, కొత్తగా తరగతి గదులు, ప్రహరీ గోడల నిర్మాణం, స్కూళ్లకు వెల్ల వేయడం, తరగతి గదుల్లో రంగులు, కొత్త బెంచీల ఏర్పాటు, ల్యాబ్, లైబ్రరీలకు నిధుల కేటాయింపు, లైబ్రరీలకు కొత్త పుస్తకాల కోసం నిధులు కేటాయింపు వంటి చర్యలకు ప్రభుత్వం పూనుకుంది. ప్రధానంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పరిధిలోకి పాఠశాలలు, విద్యాసంస్థల అభివృద్ధి పనులను కూడా చేర్చడంతో కలిసొచ్చింది. ‘పని’తో ముడిపడినవన్నీ కార్మికుల కాంపొనెంట్ కింద చూపించుకుని ఆ నిధులు మురిగిపోకుండా పాఠశాలలు, కాలేజీలు, డిగ్రీ కాలేజీల అభివృద్ధికి వినియోగించుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థల వ్యవహారంపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంగళవారం సమీక్షించారు. ఈ సమీక్షలో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద నిధులు మురిగిపోకుండా వివిధ కాంపొనెంట్‌ల కింద ఏ విధంగా ఎక్కువ మొత్తంలో నిధులు వినియోగించుకునే మార్గం ఉందో అధికారులతో చర్చించి , వెంటనే అందుకు సంబంధించిన ప్రతిపాదనలను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌తో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని అన్నారు.
మరోపక్క ప్రపంచ బ్యాంకు నిధులు, కేంద్రప్రభుత్వం నుండి వచ్చిన నిధులను సైతం విద్యాసంస్థల అభివృద్ధికి వినియోగించుకునేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని డిఇఓలకు ఆదేశాలు వెళ్లాయి.