తెలంగాణ

త్వరలో ఇండస్ట్రియల్ క్లినిక్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: తెలంగాణలో ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణకు త్వరలో ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేయనున్నట్టు ఐటి, పరిశ్రమల మంత్రి కె తారకరామారావు వెల్లడించారు. రాష్ట్రంలో పరిశ్రమల సత్వర అభివృద్ధి, అందుకు తగిన వాతావరణం నెలకొల్పేందుకు ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమ పరిశ్రమల విధానాన్ని ప్రకటించిందన్నారు. రాష్ట్రంలో ఖాయిలాపడిన పరిశ్రమలకు ఆర్థిక ఊతమిచ్చేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతున్నామన్నారు. పరిశ్రమలకు రుణమిచ్చే విధానాలను ఖరారు చేస్తామన్నారు. దేశంలోనే ఈ తరహా క్లినిక్‌లను ఏర్పాటు చేయనున్న తొలి రాష్ట్రం తెలంగాణ కావడం విశేషమన్నారు. తెలంగాణలో పరిశ్రమల రంగం, టెక్నాలజీ, అభివృద్ధి అనే అంశంపై భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) బుధవారం నిర్వహించిన సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కాలుష్యరహిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపలకు కాలుష్య పరిశ్రమలను తరలించనున్నట్లు చెప్పారు. అందుకు వీలుగా వౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. జహీరాబాద్‌లో నిమ్జ్ వస్తోందని, దీనివల్ల తెలంగాణ పరిశ్రమల స్వరూపం మారనుందన్నారు. ఫార్మా సిటీ, మెడికల్ పరికరాల తయారీ పార్కు, ప్లాస్టిక్ సిటీ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, ఫుడ్ ప్రాసెసింగ్ పార్కు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా యస్ బ్యాంకు, సిఐఐ రూపొందించిన తెలంగాణ గేట్ వే టు ది ఫ్యూచర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ నివేదికను కెటిఆర్ ఆవిష్కరించారు. సరళంగా వ్యాపారం చేసేందుకు అనువైన వాతావరణం, సామాజిక పరిస్థితులు, ప్రభుత్వ తోడ్పాటు, మానవ వనరుల లభ్యత తెలంగాణలో ఉన్నాయన్నారు. సిఐఐ సదరన్ రీజియన్ చైర్మన్ రమేష్ దాట్ల మాట్లాడుతూ సరళంగా వాణిజ్యం చేసేందుకు అనువైన విధానాల వల్ల తెలంగాణకు పెట్టబడుల వెల్లువ మొదలైందన్నారు. తయారీ రంగంలో పోటీతత్వాన్ని పెంచేందుకు సిఐఐ కృషి చేస్తుందన్నారు. యస్ బ్యాంక్ సౌత్ ఇండియా రీజనల్ బిజినెస్ హెడ్ ఆర్ రవిచందర్ మాట్లాడుతూ టిఎస్ ఐపాస్ విధానాన్ని ప్రశంసించారు. సిఐఐ తెలంగాణ మ్యానుఫ్యాక్చరింగ్ ప్యానెల్ కన్వీనర్ దేబాసిస్ బసుస, సిఐఐ తెలంగాణ చైర్మన్ నృపేంద్రరావు, వైస్ చైర్మన్ వి రాజన్నతోపాటు పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

chitram...
సిఐఐ రూపొందించిన తెలంగాణ గేట్ వే టు ది ఫ్యూచర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ నివేదికను ఆవిష్కరిస్తున్న మంత్రి కెటిఆర్