సబ్ ఫీచర్

పోటీ పరీక్షలలో తెలుగు కనిపించదేం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉభయ తెలుగు రాష్ట్రాలలో తెలుగు కనుమరుగైపోతోంది. ఏ తెలుగు అన్నది అప్రస్తుతం. తెలంగాణ తెలుగైనా, ఆంధ్రా తెలుగైనా తెలుగే. తెలుగు ఉనికికే ప్రమాదం వాటిల్లుతున్నప్పుడు ఈ విభేదాలను కొండంత చేస్తే నష్టపోయేది తెలుగేకదా! ఇరు రాష్ట్రాలు కలిసి తెలుగు వెలుగుకోసం ప్రయత్నించాలి. ‘‘గతంగతః’’అన్నారు. భాషాశాస్త్రం తెలియక ‘‘యాస’’అనీ, ‘‘అప్రామాణికం’’అనీ అన్నది నిజమే. ఇప్పుడటువంటి భావాలకి స్వస్తిచెప్పాలి. ‘తెలుగు’వికసించాలి. తెలుగు దీపం అఖండ జ్యోతిగా ప్రకాశించాలి. అందుకు మనం ఏం చెయ్యాలన్న ఆలోచన ఈ వ్యాసానికి ప్రాతిపదిక. మొదటగా పోటీపరీక్షలలో తెలుగు భాషా సాహిత్యాలపై వంద మార్కులకి తప్పనిసరి (కంపల్సరీ) ప్రశ్నపత్రం ఉండాలి. తమిళనాడు, కర్ణాటక, ఒడిశా వంటి రాష్ట్రాలలో మాతృభాషపై ఒక ప్రశ్న పత్రం ప్రభుత్వ ఉద్యోగాలకు తప్పనిసరిగా వుంది. అందులో అర్హత సాధిస్తేనే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. లేకపోతే ఎన్ని మార్కులువచ్చినా అందులో అర్హత సంపాదించేంతవరకు ఉద్యోగం ‘‘పెండింగ్’’లో వుంటుంది. మన తెలుగు రాష్ట్రాలలో తెలుగు రాకపోయినా ప్రభుత్వ ఉద్యోగం వచ్చేస్తుంది- ఆంగ్లంవస్తే చాలు! ఎంత దారుణం! పోటీపరీక్షలైన గ్రూప్-1, గ్రూప్-2లలో పూర్వం తెలుగు భాషా సాహిత్యాలు ఒక ‘‘ఆప్షనల్’’గా వుండేది. అప్పుడు చాలామంది తెలుగు తీసుకొని ఉద్యోగాలు సంపాదించారు. ఆ తర్వాత సైన్స్ ‘‘విద్యార్థులు వెనుకబడుతున్నారన్న సాకుతో ‘‘ఆప్షనల్’’ పద్ధతిని రద్దుచేశారు. దీంతో పోటీపరీక్షలలో అప్పటివరకు వెలిగిన తెలుగుదీపం ఆరిపోయింది. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలలో తెలుగు భాషా సాహిత్యానికి ‘‘ఆటలో అరటిపండు’’లాగా అయిదారు మార్కులకి వుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రూప్-1, గ్రూప్-2లలో తెలుగుకి ప్రాధాన్యం ఇవ్వకపోవటం అన్యాయం. తెలంగాణ సాహిత్యానికి పెద్దపీట లేదు సరికదా- అయిదారు మార్కులకి తెలుగు నిర్ణయించి చేతులు దులిపేసుకొన్నారు. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో కవులు, రచయితల పాత్ర మరువలేనిది. తెలంగాణ ఏర్పడితే మరుగునపడ్డ సాహిత్యం వెలుగులోకి వస్తుందన్న ఆశపై నీరు చల్లారు.
సాంకేతిక అభివృద్ధివల్ల తెలుగు రాసే అలవాటు బాగా తగ్గిపోయింది. స్మార్ట్‌లూ, ఆండ్రాయిడ్లూ, లాప్‌టాప్‌లూ వగైరాలు తెలుగును వెనక్కి ‘‘నెట్టే’’శాయి. ‘‘నాకు తెలుగు రాయటం రాదు’’అనే కొత్త తరాన్ని గమనిస్తున్నాం. ఆంగ్ల మాధ్యమానికి ఈ సాంకేతిక పరిజ్ఞానం తోడై తెలుగు అప్రాధాన్యానికి తగ్గిపోవటం చూస్తున్నాం. తెలుగు పండితులు, తెలుగు అధ్యాపకులు వంటి పోటీ పరీక్షలలో కూడా ‘‘ప్రశ్న- సమాధాన’’ రూపపద్ధతి లేదు. ‘‘ఆబ్జెక్టివ్’’ పద్ధతి వచ్చింది. దీనివల్ల తెలుగు రాయక్కర్లేకుండానే తెలుగు అధ్యాపకుడు, ఉపాధ్యాయుడు కావచ్చు. ఇదీ నేటి దారుణమైన స్థితి. ఉదాహరణకి-
* పోతన భాగవతంలో లేనిది-
1. రుక్మిణీ కల్యాణం 2. వామన చరిత్ర
3. శకుంతలోపాఖ్యానం 4. ఏదీ కాదు ( )
ఇందులో సరైన సమాధానం అంకెల రూపంలో గుర్తించడమే తప్ప రాయనక్కరలేదు. అందుకని ‘రుక్మిణి’ ‘కల్యాణం’, ‘ఉపాఖ్యానం’అనేవి ఎలా రాయాలో తెలీదు. ఇక్కడ ‘లిపి’ ముఖ్యం కాదు. ఒకవేళ ప్రశ్న పత్రంలో తప్పుగా రాసినా అభ్యర్థికి అనవసరం- ఆ అంకె రాస్తే చాలు. ఇదీ భయంకరమైన సంఘటన. కొన్ని ప్రశ్నలు వ్యాస రూపంగా, మరికొన్ని ‘ఆబ్జెక్టివ్’గా ఇవ్వవచ్చు. అసలు భాషాభిమానం అంటూ ఉంటేనే గదా ఏ ఆలోచన అయినా రావటానికి! కొత్త పద్ధతిలో మూల్యాంకనం (వాల్యుయేషన్) తేలిక కాబట్టి అమలుచేస్తున్నామంటారు- తెలుగు భాష ఏమైపోయినా పట్టించుకోని యంత్రాంగం మనది. జాతీయ స్థాయిలో యు.పి.పి.ఎస్. నిర్వహించే సివిల్స్ పరీక్షలో (ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్. వంటివి) మాతృభాష తప్పనిసరి చేశారు. అందులో అర్హత మార్కులు సంపాదిస్తేనే ఉద్యోగం వస్తుంది. తెలుగు మాతృభాషగా గల మన రాష్ట్రాలలో తెలుగు తప్పనిసరి కానేకాదు. తెలుగు చదవటం, రాయటం రాకున్నా ప్రభుత్వ ఉద్యోగం వచ్చేస్తుంది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో మాతృభాష తప్పనిసరి! ఎన్ని రాష్ట్రాలు ఏర్పడినా, ఎంత హేమాహేమీలు ముఖ్యమంత్రులైనా, ఎన్ని బడ్జెట్లు వచ్చినా మాతృభాషను నిర్లక్ష్యం చేయడం తెలుగుజాతి సహజ లక్షణం. గురజాడ అందుకే ‘‘మన వాళ్ళొట్టి వెధవాయలోయ్’’ అన్నాడు.

- ద్వా.నా.శాస్ర్తీ