హైదరాబాద్

తెలుగు సాహిత్యంలో ప్రాంతీయ వాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 24: తెలుగు సాహిత్య రంగంలో మునుపు ఎన్నడూ లేని రీతిలో కీలక పరిణామాలు గత 30 సం.లుగా చోటుచేసుకున్నాయని వక్తలు అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ త్రి దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం తెలుగు సాహిత్య శాఖ ఆధ్వర్యంలో ‘3 దశాబ్దాల తెలుగు సాహిత్యం’ అనే అంశంపై జాతీయ సదస్సు జరిగింది. సదస్సులో పాల్గొన్న ప్రముఖ విమర్శకులు గత 3 దశాబ్దాల్లో తెలుగు సాహిత్యంలో స్ర్తివాదం, దళితవాదం, మైనారిటీ వాదం, ప్రాంతీయ వాదం గాఢమైన ముద్ర వేశాయని అన్నారు. ‘మైనారిటీ వాదంపై’ డా. యాకూబ్ ప్రసంగిస్తూ మైనారిటీ వాదం ఈ 3 దశాబ్దాల్లో తమ గోడును, ప్రతిఘటనను వినిపించడానికి రచనలను ప్రయోగించిందని అన్నారు.
మైనారిటీ వాదులు తమ రచనల్లో ప్రశ్నలు లేవనెత్తుతూనే సంయమన దృష్టిని అనుసరించారని తెలిపారు. డా. గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి ‘సాహిత్యంలో ప్రాంతీయవాదం’ పై ప్రసంగిస్తూ తెలంగాణ సాహిత్యంలో ప్రాంతీయ వాదం ప్రస్ఫుటించిందని, దీనికి చారిత్రక నేపథ్యం ఉందని అన్నారు. ప్రాంతీయ వాదం రాజకీయ ఉద్యమంతోనే బలపడుతుందనే విషయాన్ని తెలంగాణ ఉద్యమం నిరూపించిందని, ఉత్తరాంధ్ర సాహిత్యంలోనూ ప్రాంతీయ వాదం కనిపించినప్పటికీ అది వాదంగా బలపడలేదని వివరించారు. ఆచార్య సి.మృణాళిని అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో వాడ్రేవు చినవీరభద్రుడు కీలకోపన్యాసం చేశారు.
1981-2011 మధ్య అక్షరాస్యత నలభై శాతం పెరగడం సాహిత్యంలో గణనీయమైన మార్పును తెచ్చిందన్నారు. ఈ 30 ఏళ్ళల్లో ఇప్పటి 2 రాష్ట్రాల్లోనూ, ప్రవాసాంధ్రుల్లోనూ సాహిత్య సృజన ఎంతగానో పెరిగిందన్నారు. ‘స్ర్తివాదంపై’ డా.కె.ఎన్.మల్లీశ్వరి మాట్లాడుతూ 1985-95 మధ్యకాలంలో స్ర్తివాద సాహిత్యం, విమర్శ సాంద్రతరంగా వచ్చిందన్నారు. స్ర్తివాదం అన్ని రకాలైన వివక్షను ప్రశ్నించిందని, ఇటీవలి కాలంలో స్ర్తివాదంలో స్తబ్దత ఏర్పడిందని అంటున్నా ఇప్పటికీ భిన్న పార్వ్శల్లో స్ర్తివాదం కొనసాగుతూనే ఉందని తెలిపారు.
‘దళితవాదం’ గురించి డా. కోయి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఊరి చేత వెలివేయబడిన వాడి సాహిత్యమే దళిత సాహిత్యమని కవితాత్మకంగా అన్నారు. మృణాళిని అధ్యక్షోపన్యాసం చేస్తూ ఈ మూడు దశాబ్దాల్లో అస్తిత్వ ఉద్యమాల ఫలితంగా రచనల్లో నూతనత్వం వచ్చిందన్నారు.