రాష్ట్రీయం

పలు ఆలయాల్లో సేవలు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కరోనా భయంతో పలు ఆలయాల్లో ఆర్జిత సేవలను రద్దు చేశారు. ప్రపంచ ప్రఖ్యాతగాంచిన తిరుమల పైకి వచ్చే ఘాట్ రోడ్డులను మూసివేశారు. దిగువకు వచ్చే ఘాట్ రోడ్లు మాత్రమే పనిచేస్తున్నాయి. అలిపిరి గరుడ సర్కిల్ నుంచి వచ్చే భక్తులను వెనక్కి పంపుతున్నారు. కొండపై నుంచి వాహనాలన్నీ దిగువకు వచ్చాక ఘాట్ రోడ్డును అధికారులు మూసివేయనున్నారు. అలాగే ఏపీలో మరొక పుణ్యక్షేత్రమైన అన్నవరంలోవ్రతాలను నిలిపివేశారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో కొలువైన శ్రీ వీర వెంకట సత్యానారాయణ స్వామి ఆలయంలో వ్రతాలను నిలిపివేశారు. తెలంగాణలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో అన్ని ఆర్జిత సేవలు ఈనెల 31వ తేదీవరకు నిలిపివేశారు. కేవలం లఘు దర్శనం ద్వారానే స్వామిని దర్శించుకునే అవకాశం ఉంది. మిగిలిన అన్ని సేవలు రద్దయ్యాయి. శ్రీశైలం పాతాళ గంగలో పుణ్యస్నానాలను నిలిపివేశారు. అలాగే భక్తులు దర్శనానికి రావద్దని ఆలయ అధికారులు విజ్ఞప్తిచేశారు. ఒకవేళ వస్తే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన తరువాతే అనుమతి ఇస్తామని వెళ్లడించారు.