అంతర్జాతీయం

తీవ్రవాద ధోరణుల పట్ల కఠినంగా వ్యవహరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత నాయకత్వానికి అమెరికా కమిషనర్ హితవు
వాషింగ్టన్, మార్చి 10: అంతర్జాతీయ మతపరమైన స్వేచ్ఛపై ఏర్పడిన అమెరికా కమిషన్ (యుఎస్‌సిఐఆర్‌ఎఫ్) సభ్యులకు వీసాలు ఇవ్వడానికి తిరస్కరించడం ద్వారా భారత్ ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోయిందని ఆ కమిషన్‌కు చెందిన కమిషనర్ కట్రినా లాంటోస్ స్వెట్ అన్నారు. దేశంలో తీవ్రవాద ధోరణులతో మాట్లాడే శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆమె భారతదేశ ఉన్నత స్థాయి నాయకత్వానికి హితవు పలికారు. ‘ఇది 1.25 బిలియన్ల (125 కోట్ల) మంది ప్రజలున్న ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశం. కీలకమైన మానవ హక్కులను కాపాడడానికి కృషి చేసే అమెరికా కమిషన్‌కు చెందిన కమిషనర్లు, నిపుణులను దేశంలోకి అనుమతించే విషయంలో వారు కొంతవరకు రక్షణాత్మక వైఖరితో ఉన్నారనేది వాస్తవం. ఇది వారి బలహీనతనే తప్ప బలాన్ని ప్రతిబింబించడం లేదనేది నా అభిప్రాయం’ అని లాంటోస్ స్వెట్ ఒక వార్తాసంస్థ ప్రతినిధితో అన్నారు. ‘్భరత్ కమిషన్‌ను అనుమతించడం ద్వారా తనకు జరిగే మంచిని గ్రహించలేపోయింది. ఫలితంగా ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోయిందని నేను భావిస్తున్నాను’ అని లాంటోస్ స్వెట్ అన్నారు. లాంటోస్ స్వెట్ నేతృత్వంలో యుఎస్‌సిఐఆర్‌ఎఫ్ ప్రతినిధి బృందం భారత్‌లో పర్యటించాల్సి ఉండింది. భారత్ వీసాలు జారీ చేయడానికి తిరస్కరించడం వల్ల ఆ ప్రతినిధి బృందం భారత్‌ను సందర్శించలేక పోయింది. భారత్ యుఎస్‌సిఐఆర్‌ఎఫ్ సభ్యులకు వీసాలు ఇవ్వడానికి తిరస్కరించడం ఇది మూడోసారని, గతంలో 2001లో, 2009లో కూడా ఇలాగే తిరస్కరించిందని లాటోస్ స్వెట్ తెలిపారు. భారత్ ఒక గొప్ప సమాజమని, ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన దేశాలలో ఒకటని ఆమె అన్నారు. ‘్భరత్ వంటి ప్రజాస్వామిక, బహుళ సంస్కృతులు గల దేశం అమెరికా కమిషన్‌ను స్వాగతిస్తుందని ఎవరైనా విశ్వసిస్తారు’ అని ఆమె వ్యాఖ్యానించారు. అయితే భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రక్షణాత్మకమైనదే అని ఆమె వ్యాఖ్యానించారు. భారత్‌లోని కొన్ని రాష్ట్రాలలో తీవ్రమైన సమస్యాత్మక చట్టాలు ఉన్నాయని, మత పరమైన మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని మత హింస చోటు చేసుకోవడం ఆందోళన కలిగించే అంశమని ఆమె అన్నారు.