క్రీడాభూమి

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్.. సఫారీల ఎదురీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డర్బన్, డిసెంబర్ 29: ఇంగ్లాండ్‌తో స్వదేశంలో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా డర్బన్‌లోని కింగ్స్‌మేడ్ మైదానంలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు ఓటమికి ఎదురీదుతోంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 89 పరుగుల ఆధిక్యత సాధించిన ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో సోమవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు నష్టపోయి 172 పరుగులు సాధించింది. ఆ స్కోరుతో మంగళవారం ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టులో నైట్ వాచ్‌మన్ జేమ్స్ టేలర్ 42 పరుగులు సాధించి వెనుదిరగ్గా, జో రూట్ (73), వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో (79) అర్థ శతకాలతో అలరించారు. అయితే మొరుూన్ అలీ (16), క్రిస్ వోక్స్ (23) మినహా ఎవరూ మిగిలిన వారెవరూ బ్యాటింగ్‌లో రాణించలేకపోవడంతో 326 పరుగులకు ఆలౌటైన ఇంగ్లాండ్ జట్టు సఫారీలకు 416 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టులో ఓపెనర్లు డీన్ ఎల్గర్ (40), వాన్ జిల్ (33) సహా కెప్టెన్ హషీమ్ ఆమ్లా (12), ఫఫ్ డుప్లెసిస్ (9) నిష్క్రమించారు. అయితే సీనియర్ ఆటగాడు ఎబి.డివిలియర్స్ (37), డేల్ స్టెయిన్ (0) అజేయంగా నిలువడంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు నష్టపోయి 136 పరుగులు రాబట్టిన సఫారీలు ఓటమి నుంచి గట్టెక్కేందుకు ఇంకా 280 పరుగుల దూరంలో ఉన్నారు.