రాష్ట్రీయం

నేడు టెట్ నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్చి 30 వరకూ ఫీజుల చెల్లింపు
ఏప్రిల్ 20 నుండి హాల్‌టిక్కెట్లు
మే 1న టెట్ పరీక్ష

హైదరాబాద్, మార్చి 12: ఉపాధ్యాయుల కనీస అర్హత పరీక్ష -టెట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఆదివారం విడుదల చేయనుంది. పరీక్ష మే 1న నిర్వహించి 20 రోజుల్లో మార్కులు ప్రకటించనున్నారు. వీలైతే ముందే డి.ఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి, టెట్ ఫలితాల ప్రకటన వెంటనే డిఎస్సీ నిర్వహించి పాఠశాలలు తెరిచే నాటికి ఉపాధ్యాయులను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపును మార్చి 15 నుండి 30వరకూ అనుమతిస్తారు. 16 నుండి 31 వరకూ టిఎస్‌టెట్ డాట్ సిజిజి డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. ఆరోజు నుండి మే 1 వరకూ హెల్ప్ డెస్క్ పనిచేస్తుంది. హాల్‌టిక్కెట్లను ఏప్రిల్ 20 నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష మే 1న జరుగుతుంది.
డి.ఎస్సీ ప్రకటన విడుదల చేయాలి
ప్రభుత్వం వెంటనే డి.ఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నర్సిరెడ్డి, చావ రవి డిమాండ్ చేశారు. కేంద్రం టెట్ నిర్వహణపై పరిశీలన చేస్తోందని, మరోపక్క ఇప్పటికే టెట్‌కు సంబంధించిన షెడ్యూలును జారీ చేసినందున, టెట్‌తో సంబంధం లేకుండా డి.ఎస్సీ ప్రకటించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా క్షాత్రోపాధ్యాయులు డిఎస్సీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారని వారు పేర్కొన్నారు. అన్ని యాజమాన్యాల్లో 20వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, రెండేళ్లు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండానే గడిచిపోయాయని పేర్కొన్నారు.