రాష్ట్రీయం

వైట్‌కాలర్, సైబర్ నేరాలపై అవగాహన కలిగివుండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఏపి అదనపుడిజిపి ఆర్‌పి ఠాకూర్
హైదరాబాద్, డిసెంబర్ 5: సాంకేతిక పరిజ్ఞానంతోపాటు వైట్ కాలర్, సైబర్ నేరాలపై అవగాహన కలిగివుండాలని ఆంధ్రప్రదేశ్ అదనపు డిజిపి ఆర్‌పి ఠాకూర్ సూచించారు. శనివారం నగరంలోని సిఐడి బిల్డింగ్‌లో జరిగిన సబ్-ఇన్స్‌పెక్టర్లకు ‘సైబర్ క్రైమ్ అండ్ సోషల్ మీడియా‘పై నాలుగు రోజుల పాటు జరిగిన శిక్షణ ముగింపు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఠాకూర్ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాను వినియోగిస్తూ అనేక రకాల మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ఆధునిక టెక్నాలజీతో సైబర్ నేరాలతోపాటు వైట్ కాలర్ నేరాలకు పాల్పడుతున్న మోసగాళ్లను కనిపెట్టడంలో పోలీసులకు కొన్ని ఇబ్బందులు ఎదురువుతుండవచ్చు వాటిని అధిగమించే దిశగా పోలీసులు తమ వృత్తి నైపుణ్యతను పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. నేరాలను అరికట్టడానికి ప్రజలు పోలీసులకు సహకరించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. సిఐడి విభాగం ఐజిపి సునీల్‌కుమార్, అతుల్ సింగ్, కాంతి రాణా టాటా తదితరులు పాల్గొన్నారు.

సేవా కార్యక్రమాలకే అంకితం
* పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా స్పష్టం
హైదరాబాద్, డిసెంబర్ 5: ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో మతాలకు అతీతంగా అన్ని వర్గాల్లోని పేద వర్గాలకు సేవా కార్యక్రమాలను అందిస్తున్నామని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి సయ్యద్ మొయినుద్దీన్, కర్నూలు అధ్యక్షుడు సయ్యద్ జమాలత్ తెలిపారు. తమ సంస్థ అనేక సంవత్సరాలుగా సమాజంలో అట్టుడుగున ఉన్న ముస్లింలు, హిందువుల సముద్ధరణకు పాటుపడుతోందని, తమ సంస్ధపై కళంకిత ముద్ర పడే విధంగా వచ్చిన అభియోగాల్లో నిజం లేదన్నారు. ఆంధ్రభూమిలో ప్రచురితమైన బందరు ఇంజనీర్‌కు ఐఎస్‌ఐఎస్ లింకు అనే వార్తలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు దేశ విద్రోహ సంస్ధలతో సంబంధం ఉన్నట్లు వచ్చిన సమాచారం సత్యదూరమని , అభియోగాల్లో వాస్తవం లేదని వారు స్పష్టం చేశారు. తాము రాజ్యాంగ బద్ధులై సమాజంలో శాంతి సాధనకు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. వెనకబడిన రాయలసీమ, ఆంధ్ర జిల్లాలు, తెలంగాణ రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా అనేక స్వచ్చందసేవా కార్యక్రమాలను చేపట్టి గతంలో పలువురి ముఖ్యమంత్రుల మన్ననలు పొందామన్నారు. తమకు ఐఎస్ లేదా దేశ విచ్ఛిన్నానికి పాల్పడే ఏ సంస్థలతో సంబంధం లేదని, దేశ భద్రతకు ప్రాణ త్యాగం చేసేందుకు ముందుంటామన్నారు. తమ సంస్థకు మతోన్మాద సంస్థలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. 2007లో తమ సంస్ధ ఆవిర్భవించిందని, అప్పటి నుంచి ఎలాంటి మచ్చలేకుండా సమాజ అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు.

12న జాతీయ లోక్‌అదాలత్
హైదరాబాద్, డిసెంబర్ 5: జాతీయ లోక్‌అదాలత్‌ను ఈనెల 12న నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి జి.శ్యామ్‌ప్రసాద్ ప్రకటించారు. ఏపిలోని అన్ని కోర్టుల్లో అదే రోజు జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని, దీనిద్వారా ఉచిత సేవలు అందించబడతాయన్నారు. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే కేసులకు సంబంధించి ఏదైనా ఫీజులు చెల్లించి ఉంటే ఈ లోక్‌అదాలత్‌లో పరిష్కారమైతే ఆ ఫీజును తిరిగి చెల్లించడం జరుగుతుందని అన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవాలని భావించుకున్న వారు లోక్‌అదాలత్‌ను వినియోగించుకోవచ్చని తెలిపారు.

వైకుంఠపురం ఆలయాన్ని టిటిడి అథీనంలోకి తీసుకుఠావాలి
హైదరాబాద్, డిసెంబర్ 5: నవ్యాంధ్ర రాజధాని అమరావతి మండల పరిధిలోని వైకుంఠపురం గ్రామంలో ఉత్తర వాహిణి ఆలయంగా పేరొందిన అతిపురాతన వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) స్వాధీనం చేసుకోవాలని అమరావతి అభివృద్థి అథారిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు ఏపి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. దాదాపు 5 వేల సంవత్సరాల నాటి పురాతన వేంకటేశ్వర ఆలయాన్ని టిటిడికి అప్పగించి ఆలయ వైభవాన్ని తెలియజేసే విధంగా తీర్చిదిద్దాలని కోరారు. విజయవాడ-అమరావతి రహదారిలోని పెదమద్దూరు గ్రామంలో కొండవీటి వాగుపై ఉన్న వంతెన కూలిపోయే స్థితిలో ఉందని సిఎం దృష్టికి తీసుకెళ్లారు. అమరావతిలో పెద్ద ప్రాజెక్టు గానీ లేదా హైకోర్టును గానీ ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇసుక అక్రమ సొమ్ములో టిడిపి పెద్దలకు వాటాలు: వైకాపా
హైదరాబాద్, డిసెంబర్ 5: ఆంధ్రాలో ఇసుక మాఫియాతో టిడిపి నేతలకు సంబంధం ఉందని, అక్రమ సొమ్ములో టిడిపి పెద్దలకు వాటాలు అందుతున్నాయని వైకాపా సీనియర్ నేత అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. శనివారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వానికి మూడు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి ఇసుక ధరను 17 శాతం పెంచిన ప్రభుత్వం తీరా చూస్తే ఖజానాకు రూ.500 కోట్లు మాత్రమే వచ్చినట్లు చెబుతున్నారన్నారు. ఇసుక అక్రమాల్లో భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పేందుకు ఇది నిదర్శనమన్నారు. ప్రత్యేక హోదా అంశంపై ఏకాభిప్రాయం తీసుకున్నారా అని ఆయన నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి చంద్రబాబు జనతా పార్టీగా మారిందన్నారు. ప్రత్యేక హోదా సాధించేంత వరకు విశ్రమించని పోరాటం చేస్తుందన్నారు.

శే్వతపత్రాలపై చర్చకు సిద్ధం: టిడిపి
హైదరాబాద్, డిసెంబర్ 5: వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన ఇసుక మాఫియా, ఎర్రచందనం స్మగ్లింగ్ సహా అన్ని అంశాలపైన బహిరంగ చర్చకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమా అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మల్లెల లింగారెడ్డి సవాల్ విసిరారు. ఎ ఇసుక విధానంపై వాస్తవాలను తెలియజేస్తూ చంద్రబాబు బహిరంగ లేఖ రాస్తే వైకాపా అర్థం లేని ఆరోపణలు చేయడం దివాళాకోరుతనమని ఆరోపించారు. వైఎస్ హయాంలో ఉన్న ఇసుక ఆదాయం రూ.25 కోట్లకు బదులుగా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రూ.1000 కోట్లకు పెరిగిందని అన్నారు. పటిష్టమైన ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల అవినీతిని అరికట్టి ప్రభుత్వానికి చంద్రబాబు వెయ్యికోట్ల ఆదాయాన్ని సమకూర్చి పెట్టారని గుర్తు చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన శే్వతపత్రాలపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు.

రాజ్యసభను సంస్కరించాల్సిందే
లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్
హైదరాబాద్, డిసెంబర్ 5: రాజ్యసభ అధికారాలనే కాదు సభ్యుల ఎంపికనూ సంస్కరించాల్సిందేనని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్‌నారాయణ్ (జెపి) అన్నారు. రాజ్యసభ అధికారాలను నియంత్రించాలంటూ వ్యాసం రాసిన బిజెడి ఎంపి జె. పాండాకు మద్దతు పలుకుతున్నట్లు ఆయన ప్రకటించారు. పాండాపై కొందరు ప్రతిపక్ష రాజ్యసభ ఎంపీలు సభా హక్కుల తీర్మానం ఇవ్వడం అర్థరహితమని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న లోక్‌సభను పని చేయకుండా చేస్తున్న రాజ్యసభ అధికారాలను పున:సమీక్షించాలని తాను పలుమార్లు బహిరంగంగానే చెప్పానని జెపి గుర్తు చేశారు. పాండా అభిప్రాయాలను పూర్తిగా సమర్థిస్తునన్నానని, ఇటీవల గోవాలో జరిగిన ఓ సదస్సులో ఆయనతో ఈ అంశాలను చర్చించానని అన్నారు. రాజ్యసభ రాష్ట్రాల మండలి అని, ప్రధానంగా రాష్ట్రాల అంశాలపై దృష్టిపెట్టాలని జెపి స్పష్టం చేశారు.