కృష్ణ

థర్మల్ కేంద్రం ఉత్పాదనపై జపాన్ బృందం పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 3: థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉద్యోగ, ఇంజనీర్లు, ఒప్పంద కార్మికులు జట్టుతత్వంగా చేసిన కృషి ఫలితంగా విద్యుత్ ఉత్పాదనలో ప్లాంట్‌లోడ్ ఫ్యాక్టరీ 83.4 శాతం సాధిస్తూ ప్రగతిపథంలో నడుస్తున్నదని థర్మల్ కేంద్రం చీఫ్ ఇంజనీర్ ఆర్ ప్రభాకరరావు తెలిపారు. థర్మల్ విద్యత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన పనితీరును పరిశీలించేందుకు జపాన్ బృందం గురువారం పర్యటించింది. ఈ సందర్భంగా మొద టి, రెండవ, మూడవ దశలోని 6 యూ నిట్లలో విద్యుత్ పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా చీఫ్ ఇంజనీర్ ప్రభాకరరావు మాట్లాడుతూ 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఈ కేంద్రంలో 83.4 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ సాధించి రాష్ట్ర విద్యుత్ కేంద్రాల కంటే ప్రథమ స్థానంలో నిలిచాయని సోదాహరణంగా వివరించారు. భద్రత చర్యలు, పర్యావరణ పరిరక్షణ, నీటి వినియోగం పనితీరును గురించి వివరించారు. 4వ దశ 500 మెగావాట్ల యూనిట్ వార్షిక ఓవర్ ఆయిలింగ్ పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే 5వ దశలో 800 మెగావాట్ల సా మర్ధ్యంగల యూనిట్ నెలకొల్పేందుకు అన్ని అనుమతులు లభించాయని వివరించారు. కోరినేషన్ విధానం, నీటి శాంపిల్స్ పరీక్షించటం, కావాలనే బొ గ్గు సుమారు 5.25 లక్షల టన్నులు నిలువులు ఉన్నాయని వివరించారు. జపాన్ బృందంలో జిటండ్ర (నిప్పొన్ కోలా లిమిటెడ్), ఎస్ సరవా సుబ్బారావు (పవర్ ప్లానింగ్ ఎక్స్‌పోర్టు, ఆంధ్రప్రదేశ్ నిప్పొస్ కోల ఎపి లిమిటెడ్), డవలప్‌మెంట్ అధికారి ఉన్నా రు. వీరితోపాటు కేంద్రంకు చెందిన కేశవస్వామి, నవీన్‌గౌతమ్, వి రమేష్‌బా బు, సాయిబాబు, సుబ్రహ్మణ్యం, లక్ష్మినారాయణ, శ్రీరాములు, మైసూరబాబు తదితరులు పాల్గొన్నారు.