తెలంగాణ

థర్మల్ ప్లాంట్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన కేంద్ర నిపుణుల కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణా నదిని సందర్శించిన కమిటీ సభ్యులు
ప్రజాభిప్రాయంపై ఆరా..అధికారుల నుండి వివరాల సేకరణ
అన్ని రికార్డులు పరిశీలించాకే నివేదిక

దామరచర్ల, డిసెంబర్ 5: రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన యా దాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ ని ర్మాణ ప్రాంతాన్ని కేంద్ర ఎక్స్‌పర్ట్ అప్రైజర్ కమిటీ (కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నిపుణుల మదింపు కమిటీ) శనివారం పరిశీలించింది. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించే ప్రాంతం మీదుగా తుంగపాడు బంధం (పెద్దదేవులపల్లి చెరువు సాగర్ వృథా జలాలు) ప్రవహిస్తూ కృష్ణానదిలో కలుస్తున్నాయి. మరో మూడు కిలోమీటర్ల దూరంలో మూసీ నది జలాలు కూడా కృష్ణానదిలో కలుస్తాయి. థర్మల్ ప్లాంట్ నిర్మాణంతో కృష్ణా, మూసీ జలాలు కలుషితమవుతాయన్న కారణంతో కేంద్ర కమిటీ థర్మల్ ప్లాంట్‌కు అనుమతులను నిరాకరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ జెన్‌కో అధికారుల అభ్యర్థన మేరకు క్షేత్ర స్థాయి పరిశీలనకు నిపుణుల కమిటీ శనివారం థర్మల్ ప్లాంట్ ప్రాంతాన్ని సందర్శించింది. కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ సిసి.బాబు, సభ్యులు పి.కె.్ధర్, ఎ.కె.్భన్సల్ బృందం థర్మల్ ప్లాంట్ ప్రాంతాన్ని, తుంగపాడు బంధం, కృష్ణానది ప్రాంతాన్ని పరిశీలించారు. రెవెన్యూ, ఫారెస్ట్, ఇరిగేషన్, ఐబి శాఖల అధికారులను, స్థానిక ప్రజలను ప్రశ్నించి సమాచారం సేకరించారు. థర్మల్ పవర్‌ప్లాంట్ నిర్మిస్తే తుంగపాడు బంధం నుండి వచ్చే నీరు ఏవిధంగా పక్కకు మరలిస్తారని నాగార్జునసాగర్ చీఫ్ ఇంజనీర్ పురుషోత్తంరాజును కమిటీ చైర్మన్ సిసి.బాబు ప్రశ్నించారు. ఈ ప్రాంతం చుట్టూ గుట్టల ప్రదేశాలతో ఉండడంతో ప్రత్యేక పరిస్థితుల్లో వృథా నీటిని మళ్ళించేందుకు చర్యలు చేపట్టలేదని వారు అన్నారు. అనంతరం కాలినడకన కృష్ణా నది వరకు వెళ్లి తుంగపాడు బంధం నీరు నదిలో కలిసే ప్రాంతాన్ని పరిశీలించారు. తుంగపాడు బంధం సాగర్ వృథా జలాలతో పాటు కృష్ణా-మూసీ జలాలు కలుషితం కాకుండా తీసుకున్న చర్యలపై అధికారులను ప్రశ్నించారు. దీనిపై అధికారులు కమిటీ సభ్యులకు సరైన సమాధానం చెప్పడంలో తడబడ్డారు. ఇరిగేషన్ అధికారులు స్పందిస్తూ సాగర్ కాలువలకు నీరు వదిలినప్పుడు మాత్రమే తుంగపాడుబంధంకు వృథా జలాలు వస్తాయని వారు తెలిపారు. థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి ఎంపిక చేసిన ప్రాంతంలో ఏ రకమైన ఫారెస్టు ఉందంటూ డిఎఫ్‌వో సత్యనారాయణను ప్రశ్నించారు. దీనికి ఆయన బి-్ఫరెస్ట్, రిజర్వ్ ఫారెస్ట్ ఈ ప్రాంతంలో ఉన్నాయని, కొంతమంది రైతులకు ఈ ప్రాంతంలో ఆర్‌ఓఎఫ్ పట్టాలు ఇచ్చారని తెలిపారు. దీంతో ఈ ప్రాంతంలో నివాస గ్రామాలు, సేద్యపు భూములు వంటి వాటి వివరాలను, రికార్డులను తమకు సమర్పించాలని ఇన్‌చార్జి ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డిని కమిటీ చైర్మన్ ఆదేశించారు. రైతులు థర్మల్ పవర్‌ప్లాంట్ నిర్మిస్తే ఏమేరకు నష్టపోతారని, రైతుల భూముల వివరాలను తెలిపాలని అడిగారు. సుమారు 892 హెక్టార్ల ఫారెస్ట్ భూమి థర్మల్ పవర్‌ప్లాంట్‌కు బదలా యంచామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. 4,700 ఎకరాల్లో థర్మల్ పవర్‌ప్లాంట్ నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని జెన్‌కో సిఇ అజయ్ కేంద్ర కమిటీ సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ థర్మల్ పవర్‌ప్లాంట్ నిర్మాణం చేపట్టేందుకు ఈ ప్రాంతంలో నివసించే ప్రజలకు, నదులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఉండాలని, దీనివలన ఎవరికీ ఎలాంటి నష్టం జరగవద్దని పూర్తి రికార్డులను పరిశీలించిన తరువాత నివేదికను కేంద్రానికి సమర్పిస్తామని అన్నారు. థర్మల్ పవర్‌ప్లాంట్ ప్రాంతంలో అనుకోకుండా వరదలు వచ్చినట్లయితే వరదల నివారణకు ఏం చర్యలు తీసుకుంటారని ఆయన అధికారులను అడిగారు. దీనిపై అధికారుల నుండి సరైన సమాధానం లేకపోయింది. ఈ ప్రాంతంలో నాగార్జునసాగర్ పునరావాస గ్రామాలు ఉన్నాయని, అయితే ఆ గ్రామాలను థర్మల్ ప్లాంట్ ప్రాజెక్టు నుండి మినహాయించామని ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి కేంద్ర కమిటీ సభ్యులకు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే భాస్కర్‌రావు థర్మల్ పవర్‌ప్లాంట్ నిర్మాణం చేపడితే నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుందని, భూములు కోల్పోయే రైతులకు ఎకరాకు రూ.6లక్షల నష్టపరిహారం అందేలా చూస్తామని కమిటీ సభ్యులకు తెలపగా మొదట సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తరువాతే తదుపరి చర్యలు చేపడతామని కమిటీ సభ్యులు తెలిపారు. వీరి వెంట ఆర్.రమేశ్, ఎమ్మెల్యే భాస్కర్‌రావు, ఐబి ఎస్‌ఇ ధర్మానాయక్, జడ్‌పిటిసి శంకర్‌నాయక్, ఎంపిపి మంగమ్మ, వీరకోటిరెడ్డి, నారాయణరెడ్డి, పర్శానాయక్, డిఎస్‌పి గోనె సందీప్, తహశీల్దార్ రమాదేవి, సిఐలు పార్ధసారధి, రవీందర్, వాడపల్లి ఎస్‌ఐ బివి.రాఘవులు ఉన్నారు.